తమిళనాడులో ఎదురెదురుగా ఢీకొన్న ప్రైవేటు బస్సులు - ఐదుగురి మృతి

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (15:09 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో రెండు ప్రైవేటు బస్సు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. మరో 80 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను కడలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నెల్లికుప్పం సమీపంలోని పట్టంబాక్కం వద్ద సోమవారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కడలూరు నుంచి వేగంగా వెళ్తున్న ప్రైవేటు బస్సు ముందు టైరు పేలి పోవడంతో ఒక్కసారిగా అదుపు తప్పిపోయింది. అదేసమయంలో బన్రుట్టి నుంచి కడలూరు వైపు వస్తున్న మరో ప్రైవేటు బస్సును బలంగా ఢీకొట్టింది. 
 
ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహకారంతో క్షతగాత్రులను బయటకి తీశారు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments