Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన - రంగంలోకి దిగిన సీబీఐ

train accident
, మంగళవారం, 6 జూన్ 2023 (12:42 IST)
ఒడిశా రాష్ట్రంలో జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం వెనుక ఉన్న కుట్ర కోణాన్ని ఛేదించేందుకు సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ రైలు ప్రమాదంలో 275 మందికి వరకు చనిపోగా, 1100 మంది గాయాలపాలయ్యారు. చనిపోయిన వారిలో 101 మంది ఆచూకీ గుర్తించలేకపోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఒడిశా రైలు దుర్ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ మొదలుపెట్టింది. మంగళవారం ఉదయం 10 మంది సీబీఐ అధికారుల బృందం బాలాసోర్‌లోని ప్రమాదస్థలికి చేరుకుంది. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి.. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించింది. రాష్ట్ర పోలీసులు సేకరించిన సాక్ష్యాలు, వాంగ్మూలాలను సీబీఐ పరిశీలించింది.
 
రైలు దుర్ఘటనపై ఒడిశా పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంతో ప్రాణాలకు హాని కలిగించడం, మరణాలకు కారణమవ్వడం వంటి అభియోగాలతో ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. కాగా.. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందన్న ఆరోపణలు వ్యక్తమైన విషయం తెలిసిందే. రైళ్లు సురక్షితంగా నడవడంలో అత్యంత కీలకమైన ‘ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ’లో మార్పులు చేయడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు రైల్వే శాఖ ప్రాథమిక నివేదికలో వెల్లడించింది.
 
అయితే, ఇది ఉద్దేశపూర్వకమేనా? ప్రమాదం వెనుక కుట్ర ఏమైనా ఉందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. విధ్వంసక చర్యకు పాల్పడేందుకే కొందరు వ్యక్తులు.. ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థలో మార్పు చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఎవరో వ్యవస్థలో జోక్యం చేసుకోనిదే మెయిన్‌లైన్‌కు ఖాయం చేసిన రూటును లూప్‌ లైనుకు మార్చడం సాధ్యం కాదని రైల్వే అధికారి ఒకరు తేల్చి చెప్పారు. అందుకే సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు తర్వాతే అసలు వాస్తవాలు బయటకు రానున్నట్లు ఆయన తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత నౌకాదళం అమ్ములపొదిలో మరో అస్త్రం...