చెన్నైలో ఐదేళ్ల బాలికపై రాట్ వీలర్ కుక్క దాడి.. ఈ డాగ్స్‌పై నిషేధం

సెల్వి
శుక్రవారం, 10 మే 2024 (10:49 IST)
Dogs
చెన్నైలో ఐదేళ్ల బాలికపై రాట్‌వీలర్ కుక్క దాడి చేసిన నేపథ్యంలో, ప్రజలకు "ప్రమాదకరమైనవి"గా అని పిలువబడే 33 జాతుల కుక్కల దిగుమతి, పెంపకం లేదా అమ్మకాలను తమిళనాడు పశుసంవర్ధక శాఖ గురువారం నిషేధించింది. 
 
పశుసంవర్ధక శాఖ ప్రకటన ప్రకారం, నిషేధించబడిన కుక్క జాతులు టోసా ఇను, ఫిలా బ్రసిలీరో, అమెరికన్ బుల్ డాగ్, కాకేసియన్ షెపర్డ్, కనగల్ షెపర్డ్ డాగ్, టెర్రియర్స్, మాస్టిఫ్స్, టోర్న్‌జాక్, కేన్ కోర్సో, వోల్ఫ్ డాగ్స్, అక్బాష్, పిట్‌బుల్ టెర్రియర్, అమెరికన్ స్టాఫ్, టెర్రియర్, డోగో అర్జెంటీనో, బోయర్‌బోయెల్, సెంట్రల్ ఆసియన్ షెపర్డ్ డాగ్, సౌత్ రష్యన్ షెపర్డ్ డాగ్, జపనీస్ టోసా మరియు అకిటా, రోట్‌వీలర్, రోడేసియన్ రిడ్జ్‌బ్యాక్, కానరియా, మాస్కో గార్డ్, బాండోగ్ వంటి రకాలైన శునకాలపై నిషేధం విధించారు.

ఈ జాబితాలోని కుక్కలు పునరుత్పత్తిని నిరోధించడానికి వెంటనే స్టెరిలైజేషన్ శస్త్రచికిత్స చేయించుకోవాలని పేర్కొంది. రోట్‌వీలర్స్, పిట్‌బుల్స్, అమెరికన్ బుల్‌డాగ్స్, ఇతర ప్రమాదకరమైనవిగా పరిగణించబడే వివిధ కుక్కల జాతులపై నిషేధాన్ని యూనియన్ పశుసంవర్థక శాఖ ఇప్పటికే సిఫార్సు చేసింది.

మానవ ప్రాణాలకు ప్రమాదకరమైన కుక్కల విక్రయం, పెంపకం, పెంపుడు జంతువులు వంటి వాటికి లైసెన్స్‌లు ఇవ్వకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments