Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఎమ్మెస్సీ విద్యార్థిని... ఆస్పత్రిలో ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రియుడు

ఠాగూర్
సోమవారం, 11 ఆగస్టు 2025 (12:23 IST)
హాస్టల్‌లో ఉంటూ విద్యాభ్యాసం చేసే ఓ విద్యార్థిని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను ఏం చేయాలో తోచక.. ఆమె ప్రియుడు మాత్రం ఆస్పత్రిలో ఇచ్చేదుకు తీసుకెళ్లాడు. అక్కడు వైద్యులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ యువకుడుని అదుపులోకి తీసుకున్నాడు. ఈ సంఘటన చెన్నై నగరంలోని ప్రభుత్వ ఓమందూరు ఆస్పత్రిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నై ట్రిప్లికేన్‌లోని ఓమందూరార్ ప్రభుత్వ ఆసుపత్రికి శనివారం మధ్యాహ్నం ఓ యువకుడు పుట్టి ఒక్కరోజే అయిన శిశువును సంచిలో తీసుకొచ్చాడు. తనకు ఆ శిశువు రోడ్డుపై దొరికిందని ఆసుపత్రి సిబ్బందితో చెప్పాడు.
 
అయితే, అయితే వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి ఆ యువకుడిని విచారించారు. ఆ సమయంలో అతడు పోలీసులకు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దాంతో యువకుడిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా... తాను ఊటీ నుంచి వచ్చానని, తన పేరు ప్రదీప్ అని చెప్పాడు. గ్రూప్-1 ఎగ్జామ్ కోసం చెన్నైలోని హాస్టల్లో ఉంటూ చదువుతున్నట్లు తెలిపాడు.
 
ఈ క్రమంలో గిండి వర్సిటీ హాస్టల్‌లో ఉంటూ ఎంఎస్సీ చదువుతున్న ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని, తాము శారీరకంగా ఒక్కటైనట్లు తెలిపాడు. దాంతో ఆ యువతి గర్భం దాల్చిందని చెప్పాడు. ఈ క్రమంలో శుక్రవారం సదరు యువతి హాస్టల్‌లో బిడ్డను ప్రసవించిందని, ఏం చేయాలో తోచక తాను బిడ్డను ఆసుపత్రిలో ఇచ్చేందుకు వచ్చానని పోలీసులతో అసలు నిజం చెప్పాడు. ప్రదీప్ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

Mangli: ఏలుమలై నుంచి మంగ్లీ ఆలపించిన పాటకు ఆదరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments