Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాతిలోకి చాకు దూసుకెళ్లింది.. 30 గంటలు నరకం.. చివరికి?

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (13:15 IST)
knife in chest
ఛాతిలోకి చాకు దూసుకెళ్లింది. అంతే ఆ మహిళ బాధ అంతా ఇంతా కాదు. ముళ్లు గుచ్చుకుంటేనే విలవిల్లాడిపోతాం. అలాంటిది చాకు ఛాతిలోకి వెళ్లడంతో ఆ మహిళ నరకం చూసింది. 30 గంటల పాటు ఆ బాధతో ఆ మహిళ విలవిల్లాడిపోయింది. అందరూ ఆమె బతకటం కష్టం అనుకున్నారు. కానీ వైద్యులు ఆమెను బతికించారు. వివరాల్లోకి వెళితే.. 40 ఏళ్ల మల్లిక కృష్ణగిరిలోని హోసూర్‌లో నివాసం ఉంటోంది. 
 
మే 25వ తేదీన ఓ వ్యక్తి ఆమెపై దాడి చేశాడు. చాకుతో పొడిచాడు. దీంతో చాకు ఛాతిలోకి దూసుకెళ్లింది. అనంతరం ఈమెను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. కానీ..అక్కడి వైద్యులు కోయంబత్తూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. 
 
అప్పటికే దాదాపు 30 గంటలు గడిచిపోయాయి. కోయంబత్తూర్ మెడికల్ కాలేజీ డాక్టర్ ఈ.శ్రీనివాసన్ నేతృత్వంలో వైద్యుల బృందం సుమారు మూడు గంటల పాటు శస్త్రచికిత్స చేశారు. వైద్యులు శ్రమించి ఆమె ఛాతిలో ఉన్న కత్తిని బయటకు తీశారు. 
 
ఆరు అంగుళాలు ఉన్న ఈ కత్తి.. ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది. అయితే..ఆమె గుండెకు ఎలాంటి గాయాలు కాలేదని వైద్యులు వెల్లడించారు. దీంతో ఆమె బతికి బయటపడిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా వుందని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments