Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 పాఠశాల విద్యార్థిని గర్భవతి ఆత్మహత్య... ప్రిన్సిపాల్‌, హాస్టల్‌ వార్డెన్‌ అరెస్ట్

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (12:48 IST)
16 పాఠశాల విద్యార్థినిపై అత్యాచారం, గర్భవతిని చేసిన కేసులో స్కూల్ ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్, మరొకరు అరెస్టయ్యారు. తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఈ ఘటన చోటుచేసుకుంది. అరెస్టయిన వారిని పోక్సో చట్టం నమోదు చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. సదరు విద్యార్థిని తిరువణ్ణామలైలోని ఒక పాఠశాలలో చదువుకుంది. కొద్ది రోజుల క్రితం చెంగల్‌పేట జిల్లాలోని తన గ్రామానికి వచ్చింది. ఇంటికి చేరుకున్న విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు బాలికను ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షలు చేయగా బాలిక 6 నెలల గర్భిణి అని తేలింది. 
 
అనంతరం బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ కొద్దిరోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం విద్యార్థిని ఆస్పత్రిలో మృతి చెందింది.
 
పోలీసులు విచారణ ప్రారంభించగా విద్యార్థిని చదువుతున్న పాఠశాలలో సమీపంలో హరిప్రసాద్ అనే వ్యక్తి నివాసముంటున్నట్లు తెలిసింది. బాలిక హరిప్రసాద్ కారణంగా గర్భం దాల్చినట్లు పోలీసులకు తెలిసింది. పోక్సో చట్టం కింద హరిప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడితో పాటు స్కూల్‌ ప్రిన్సిపాల్‌, హాస్టల్‌ వార్డెన్‌ కూడా అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫెస్టివల్స్ అనంతరం థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక మూవీ ఫియర్

ఏఆర్.రెహ్మాన్ తండ్రిలాంటివారు... ఆ సంబంధం అంటగట్టొద్దు ప్లీజ్ : మోహిని డే

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం