Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక చాలు, నావద్దకు రావద్దు, మా ఆయన నిన్ను చంపేస్తాడని చెప్పినా పట్టించుకోని నటుడు

Webdunia
శనివారం, 21 నవంబరు 2020 (13:28 IST)
వివాహేతర సంబంధం ఓ నటుడి ప్రాణం తీసింది. మా ఆయన నిన్ను చంపేయాలనుకుంటున్నాడు, ఆ విషయం నాకు చెప్పాడని వివాహిత స్త్రీ హెచ్చరించినా సదరు నటుడు పట్టించుకోలేదు. చివరికి ఆమె చెప్పినట్లే ఆ నటుడు వివాహిత భర్త చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు.
 
వివరాల్లోకి వెళితే... తమిళ సిరీస్ తెన్మోజి బిఎ ఫేమ్ నటుడు సెల్వరత్నం వివాహిత స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె భర్త ఇంట్లో లేనప్పుడు ఆమెతో గడిపేవాడు. ఐతే, ఆ తర్వాత ఇద్దరి వ్యవహారం మరింత ముదిరిపోయింది. బంధువుల ఇంటికి వెళ్లొస్తానంటూ ఆమె ప్రియుడు సెల్వరత్నంతో కలిసి పాండిచ్చేరి వెళ్లి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది.
 
ఇలా కొన్నిరోజులు సాగాయి. ఐతే భార్య వ్యవహారాన్ని భర్త పసిగట్టాడు. అతడితో సంబంధం మానుకోవాలని హెచ్చరించాడు. మళ్లీ అతడిని నీతో చూస్తే ప్రాణాలు తీస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీనితో ఆమె తనవద్దకు వచ్చిన సెల్వరత్నానికి విషయం చెప్పింది. కానీ సెల్వ తన తీరు మార్చుకోలేదు. ఎప్పటిలాగే ఆమె వద్దన్నా వస్తూ వున్నాడు. ఇది భరించలేని వివాహిత భర్త, తనతో పాటు మరికొందరిని తీసుకుని చెన్నై లోని విరుదనగర్ సమీపంలో సెల్వరత్నంను దారుణంగా హత్య చేసి సమీపంలోని పొదల్లో విసిరేసాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చేసాడు.
 
కానీ తన స్నేహితుడు సెల్వ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు సెల్వరత్నం వివాహేతర సంబంధం సాగిస్తున్న మహిళ వద్ద విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. నిందితుడిని, అతడికి సహకరించినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Richard Rishi : హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రిచర్డ్ రిషి చిత్రం ద్రౌపది 2

OG Review: పవన్ కళ్యాణ్ ఓజీ.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్.. ఓజీ ఒరిజినల్ రివ్యూ

11 నెలల పాటు ఈఎంఐ కట్టలేదు.. వేలానికి రవి మోహన్ ఇల్లు.. నోటీసులు అంటించేశారు..

గుజరాత్ బ్రాండ్ కాన్‌ప్లెక్స్ సినిమాస్ ప్రారంభించిన స్పీకర్, సిద్దు జొన్నలగడ్డ

Pawan: డల్లాస్ లో ఓజీ 25 అడుగుల కటౌట్ - నైజాంలో పుష్ప 2: ది రూల్ ను క్రాస్ చేస్తుందా....

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments