Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా బిడ్డ హత్యను సినిమాగా నిర్మించవద్దు: స్వాతి తండ్రి గోపాలకృష్ణన్

గతేడాది జూన్‌ 24న చెన్నైలోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ స్వాతి దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో రామ్‌కుమార్‌ అనే వ్యక్తిని నిందితుడిగా పేర్కొంటూ అరెస్టు చేశారు. అయ

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2017 (12:20 IST)
గతేడాది జూన్‌ 24న చెన్నైలోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ స్వాతి దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో రామ్‌కుమార్‌ అనే వ్యక్తిని నిందితుడిగా పేర్కొంటూ అరెస్టు చేశారు. అయితే పోలీస్‌ కస్టడీలో ఉండగా రామ్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆ హత్య దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించింది. అలాగే స్వాతి పై పలు అనుమానాలు కూడా వచ్చాయి.
 
ఇప్పుడు ఆ సంఘటనపై తమిళంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే తన కూతురి హత్యను సినిమాగా నిర్మించవద్దని స్వాతి తండ్రి సంతన గోపాల కృష్ణన్‌ పోలీసులను ఆశ్రయించారు. సినిమా కోసం తమ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అంతేగాక, ఈ ఘటనను తెరకెక్కిస్తే వాస్తవానికి వ్యతిరేకంగా తీసే అవకాశాలున్నాయని గోపాల కృష్ణన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
ఈ హత్యను నేపథ్యంగా తీసుకుని దర్శకుడు రమేశ్‌ సెల్వన్‌ ‘స్వాతి కొలై వళక్కు’ పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రైలర్‌, పోస్టర్లను కూడా చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాలో స్వాతి పాత్రలో ఆయిరా నటిస్తోంది. నిందితుడు రాంకుమార్‌ పాత్రలో మనో అనే కొత్త నటుడిని పరిచయం చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments