Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామి అగ్నివేశ్‌ ఇక లేరు

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (06:54 IST)
ఆర్య సమాజ్‌ నేత, ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌ (80) కన్నుమూశారు. కాలేయ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బిల్లరీ సైన్సెస్‌లో చేరారు.

నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయనకు శుక్రవారం సాయంత్రం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. 1939 సెప్టెంబర్‌ 21న ఎపిలోని శ్రీకాకుళం జిల్లాలో స్వామి ఆగ్నివేశ్‌ జన్మించారు.

నాలుగేళ్లకే తండ్రి మరణించడంతో తాత వద్ద పెరిగారు. కోల్‌కతాలోని సెయింట్‌ గ్జేవియర్‌ కాలేజీ నుంచి లా, కామర్స్‌లో పట్టా పొందారు. ఆర్య సమాజ్‌ సూత్రాలతో 1970లో ఆర్యసభ అనే రాజకీయ పార్టీని స్థాపించారు.

1977లో హరియాణాలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగానూ సేవలందించారు. బాలల వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించేందుకు బాండెడ్‌ లేబర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ను స్థాపించారు. మావోయిస్టులతో చర్చలు జరపడంలో కీలకంగా వ్యవహరించారు.

1875లో స్వామి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజ్‌ అంతర్జాతీయ మండలి అధ్యక్షుడిగా పదేళ్ల పాటు (2004-2014) కొనసాగారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రజాందోళన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments