Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుస్తులపై నుంచి తాకితే లైంగిక వేధింపులు కాదు.. బాంబే కోర్టు తీర్పుపై సుప్రీం స్టే

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (17:35 IST)
బాలికలను దుస్తులపై నుంచి తాకితే లైంగిక వేధింపులు కాదంటూ ఓ కేసులో బాంబే హైకోర్టు తీర్పు నిచ్చింది. శరీర భాగాలను నేరుగా తాకితేనే పోక్సో చట్టం వర్తిస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. అయితే బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. బాలికలను దుస్తులపై నుంచి తాకితే లైంగిక వేధింపులు కాదంటూ ఓ కేసులో బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ అభిప్రాయపడింది. శరీర భాగాలను నేరుగా తాకితేనే పోక్సో చట్టం వర్తిస్తుందని పేర్కొంది.
 
12 ఏళ్ల బాలికను 39 ఏళ్ల వ్యక్తి లైంగికంగా వేధించాడన్న కేసులో హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో జనవరి 19న తీర్పు వచ్చింది. నేరుగా శరీరాన్ని తాకితేనే లైంగిక పరమైన ఉద్దేశంగా పరిగణించాల్సి ఉంటుందని జస్టిస్ పుష్ప గణేదివాలా వివరించారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్సీడబ్ల్యూ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా నాగ్ పూర్ బెంచ్ తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పు సహేతుకంగా లేదని స్పష్టం చేసింది. వాదనలు విన్న తర్వాత ఆ తీర్పుపై స్టే ఇచ్చింది.
 
భారతీయ శిక్షాస్మృతిలో సెక్షన్ 354 ప్రకారం 'ఒక మహిళ శీలాన్ని చెర‌చాల‌నే ఉద్దేశంలో దాడి చేయడాన్ని నేరంగా పరిగణిస్తుంది. దీనికి ఒక సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది. కానీ పన్నెండేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో త‌న‌కు విధించిన శిక్షపై 39 ఏళ్ల వ్యక్తి బాంబే హైకోర్టులో అప్పీల్ చేశాడు. ఈ కేసుపై విచార‌ణ జ‌రిపిన నాగ్‌పూర్ బెంచ్ "శరీరాన్ని తాకకుండా చేసిన లైంగిక నేరాన్ని లైంగిక దాడిగా భావించలేమని పేర్కొంటూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ప్రస్తుతం సుప్రీం కోర్టు స్టే విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యు.ఎస్‌లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం