Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబరు 12నే నీట్ ప్రవేశ పరీక్షలు : పిటిషన్లను తిరస్కరించిన సుప్రీం

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (15:11 IST)
జాతీయ స్థాయిలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)ను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నెల 12వ తేదీన ఈ పరీక్షలను నిర్వహించేలా కేంద్రం నోటిఫికేషన్ జారీచేసింది. 
 
అయితే సెప్టెంబరు 12న మరికొన్ని పోటీ పరీక్షలు ఉన్నాయని, సీబీఎస్ఈ పరీక్షలు కూడా ఉన్నాయని అందువల్ల ఈ పరీక్షలను వాయిదావేయాలని పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 
 
వీటిపై కోర్టు స్పందిస్తూ, నీట్ పరీక్ష యధాతథంగా సెప్టెంబరు 12నే జరుగుతుందని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 16 లక్షల మంది నీట్ రాస్తున్నారని, విద్యావ్యవస్థలపై తాము జోక్యం చేసుకుంటే ఆ ప్రభావం లక్షల మందిపై పడుతుందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.
 
అయినా ఏ కొందరి కోసమో నీట్ వాయిదా వేయడం సబబు కాదని అభిప్రాయపడింది. అందుకే ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించడం లేదని స్పష్టం చేసింది. ఒకేరోజున అనేక పరీక్షలు ఉన్నాయని పిటిషనర్లు అంటున్నారని, అలాంటప్పుడు ఏదో ఒకటే ఎంచుకోవడం మేలని సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments