Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ చేసిన వాడితో గర్భం... అబార్షన్ రిక్వెస్ట్... సుప్రీంకోర్టు నో...

అత్యాచారాల సంఖ్య దేశంలో పెరుగుతూనే వుంది. కామాంధులకు వేల మంది బాలికలు బలవుతున్నారు. వారివల్ల కొందరు గర్భవతులవుతున్నారు. 10 సంవత్సరాల బాలిక రేప్ కారణగా గర్భవతి అయిన నేపధ్యంలో ఆమెకు అబార్షన్ చేయించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆమె తల్లిదండ్రులు కోర్టును ఆశ్ర

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2017 (17:19 IST)
అత్యాచారాల సంఖ్య దేశంలో పెరుగుతూనే వుంది. కామాంధులకు వేల మంది బాలికలు బలవుతున్నారు. వారివల్ల కొందరు గర్భవతులవుతున్నారు. 10 సంవత్సరాల బాలిక రేప్ కారణగా గర్భవతి అయిన నేపధ్యంలో ఆమెకు అబార్షన్ చేయించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆమె తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. 
 
ఐతే విచారణ చేపట్టిన కోర్టు అబార్షన్ పిటీషన్‌ను తిరస్కరించింది. కడుపులో వున్న బిడ్డ వల్ల తల్లికి హాని కలుగుతుందని వైద్య పరీక్షల్లో తేలితేనే అబార్షన్ అనుమతి వుంటుందని స్పష్టీకరించింది. దీనితో అత్యాచారానికి గురయినప్పటికీ, వాడి వల్ల గర్భం దాల్చిన బాలిక శిశువుకు జన్మనివ్వాల్సిన పరిస్థితి. ఐతే దీనిపై ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఎవడో కామాంధుడు చేసిన దారుణానికి తమ బిడ్డ బతుకు బలవడమే కాకుండా అతడి పాపపు పని వల్ల నవమాసాలు ఎందుకీ శిక్ష అనుభవించాలని ప్రశ్నించారు. కానీ చట్ట ప్రకారం ఆమెకు అబార్షన్ సాధ్యం కాదని కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటివరకూ ఇలాంటి కేసులు మొత్తం 20 వేలకు పైగా వున్నట్లు సమాచారం. ఇవన్నీ భారతదేశంలోనే జరుగినట్లు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం