Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేబర్ వార్డు నుంచి వెళ్లి పేషెంట్‌కు పురుడు పోసిన వైద్యురాలు.. ఎక్కడో తెలుసా?

అమెరికా వైద్యురాలికి సోషల్ మీడియా బ్రహ్మరథం పడుతోంది. ఇంతకీ ఆమె ఏం చేసిందని తెలిస్తే షాక్ అవుతారు. తాను గర్భవతి అయినప్పటికీ.. ప్రసవం కోసం లేబర్ వార్డుకు వెళ్తున్నా.. తన పేషెంట్ అదే ఆస్పత్రిలో చేరిందని

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2017 (16:19 IST)
అమెరికా వైద్యురాలికి సోషల్ మీడియా బ్రహ్మరథం పడుతోంది. ఇంతకీ ఆమె ఏం చేసిందని తెలిస్తే షాక్ అవుతారు. తాను గర్భవతి అయినప్పటికీ.. ప్రసవం కోసం లేబర్ వార్డుకు వెళ్తున్నా.. తన పేషెంట్ అదే ఆస్పత్రిలో చేరిందని.. ఆమె బిడ్డ ప్రాణాలకు అపాయమని తెలుసుకుని.. పురిటి నొప్పితోనే చికిత్స అందించింది.  ఈ క్రమంలో తన ప్రసవాన్ని ఆపేసి.. వేరే మహిళకు పురుడు పోసింది. 
 
ఈ ఘటన అమెరికాలోని కెంటుకి రాజధాని ఫ్రాంక్‌ఫోర్ట్‌‌లో చోటు చేసుకుంది. ఫ్రాంక్‌ఫోర్ట్‌ రీజినల్‌ మెడికల్‌ సెంటర్‌లో హాలిడే జాన్సన్‌ అనే మహిళ ప్రసవం కోసం చేరారు. ఇదే ఆస్పత్రిలో హాలిడేకు వైద్యం అందించి వైద్య పరీక్షలు చేసిన వైద్యురాలు డాక్టర్ అమందా హెస్ కూడా ప్రసవం కోసం అదే ఆస్పత్రిలో చేరారు. అక్కడి వైద్యులు అమందాకు పురుడు పోసేందుకు తయారీ చేసి ఆమెను లేబర్ వార్డుకు తరలించారు.
 
కానీ ఇంతలో తన వద్ద చికిత్స తీసుకున్న హాలిడే కూడా అదే ఆస్పత్రిలో ఉన్నట్లు.. ఆమె ప్రసవించే సమయంలో బిడ్డకు పేగు మెడకు చుట్టుకొని డెలివరి కష్టమైందని తెలియవచ్చింది. వెంటనే ఆమె తన ప్రాణాన్ని తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా.. డెలివరీ కోసం ధరించిన గౌనులోకి హాలిడేను ఉంచిన లేబర్ వార్డుకు అమందా వెళ్లింది. హాలిడేకు సరైన విధంగా చికిత్స అందించి ఆమెకు పురుడు పోసింది. దీంతో హాలిడే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అమందాను లేబర్ వార్డుకు తీసుకెళ్లిన వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. అమందా కూడా పండంటి పాపాయికి జన్మనిచ్చింది. 
 
లేబర్‌ గది నుంచి వచ్చి తనకు డెలివరీ చేసిన విషయం తెలుసుకొని హాలిడే భావోద్వేగానికి గురైంది. తనకు తన బిడ్డకు ప్రాణదానం చేసిందని ప్రశంసలతో ముంచెత్తింది. అలాగే ఆస్పత్రి సిబ్బంది మాత్రమే కాకుండా సోషల్‌ మీడియాలో నెటిజన్లు సైతం ఆమందపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం