Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేకింగ్ న్యూస్.. జల్లికట్టు చట్టంపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నో: తమిళ ప్రజలకు మరో విన్

తమిళులు వారం రోజుల పాటు జరిపిన జల్లికట్టు ఆందోళనలపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. జల్లికట్టుపై ఆర్డినెన్స్ విడుదల చేయడంపై తమిళనాడు సర్కారుకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అయిత

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (17:31 IST)
తమిళులు వారం రోజుల పాటు జరిపిన జల్లికట్టు ఆందోళనలపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. జల్లికట్టుపై ఆర్డినెన్స్ విడుదల చేయడంపై తమిళనాడు సర్కారుకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అయితే కొత్త చట్టం గురించి ఆరు వారాల్లోగా తమకు వివరాలు ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది.

అయితే జల్లికట్టు' నిషేధంపై పోరాటం చేసి, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారా కొత్త చట్టం తీసుకువచ్చిన తమిళ ప్రజలకు మరో విజయం వరించింది. 2016 నోటిఫికేషన్‌ను కేంద్రం వెనక్కు తీసుకునేందుకు కూడా సుప్రీంకోర్టు అనుమతించింది.
 
సుప్రీం కోర్టు నుంచి ఈ కొత్త చట్టానికి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. జల్లికట్టు చట్టంపై 'స్టే' ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం మంగళవారంనాడు నిరాకరించింది. అలాగే దీనిపై మద్రాసు హైకోర్టుకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వడానికి కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. అలాగే, జల్లికట్టు నిరసనల సమయంలో శాంతి భద్రతల పరిస్థితులను సక్రమంగా పట్టించుకోలేదంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం మందలించింది. 
 
ఇదిలా ఉంటే.. జల్లికట్టు ఉద్యమం సమయంలో విధ్వంసానికి పాల్పడినవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేదిలేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌ సెల్వం స్పష్టం చేశారు. చెన్నైలోని మెరీనా బీచ్‌ సహా పలు జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాయుత ఘటనల్లో నిందితులను గుర్తించి, శిక్షిస్తామని చెప్పారు. నాటి హింసాకాండపై దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments