Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో రేపిస్టుకు తప్పిన ఉరి... 25 యేళ్ల జైలుశిక్ష విధించిన సుప్రీంకోర్టు

కేరళకు చెందిన సౌమ్య అనే యువతి హత్య కేసులో ముద్దాయికి విధించిన మరణదండనను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ షాక్ నుంచి దేశ ప్రజలు తేరుకోకముందే మరో మరణశిక్షను కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది.

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2016 (09:18 IST)
కేరళకు చెందిన సౌమ్య అనే యువతి హత్య కేసులో ముద్దాయికి విధించిన మరణదండనను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ షాక్ నుంచి దేశ ప్రజలు తేరుకోకముందే మరో మరణశిక్షను కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. 
 
ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే... మధ్యప్రదేశ్‌లో ఐదేళ్ల క్రితం ఏడేళ్ల చిన్నారిని రేప్‌చేసి దారుణంగా హత్యచేసిన కేసులో దోషికి కింది కోర్టులు విధించిన ఉరిశిక్షను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. అతనికి 25 ఏళ్లపాటు కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. దోషి తట్టు లోధీ అలియాస్‌ పంచమ్‌ లోధీ చేసిన నేరం అత్యంత అరుదైన నేరాల కోవలోకి రాదు కాబట్టి అతనికి కింది కోర్టులు విధించిన ఉరిశిక్షను ధ్రువీకరించడంలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 
 
లోధాకు తాము విధించిన శిక్షలో భవిష్యత్తులో తగ్గించరాదని, ఏవిధంగా క్షమాపణ ప్రసాదించరాదని, పాతికేళ్లపాటు శిక్ష అనుభవించాకే అతన్ని విడుదల చేయాలని కూడా సుప్రీంకో ర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ శివకీర్తి సింగ్‌, జస్టిస్‌ ఏఎం సప్రేలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.

ఒకవేళ దోషికి యావజ్జీవ శిక్ష విధిస్తే 14 ఏళ్లు శిక్ష అనుభవించాక జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడే అవకాశం ఉందనీ, అందుకే అతనికి 25 ఏళ్ల శిక్ష విధించామని ధర్మాసనం వివరణ ఇచ్చింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments