Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం నుంచి తొలగించడానికి వివాహాన్ని కారణంగా చూపుతారా? సుప్రీంకోర్టు ప్రశ్న

వరుణ్
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (07:24 IST)
ఒక మహిళను ఉద్యోగం నుంచి తొలగించడానికి ఆమె వివాహాన్ని ఓ కారణంగా చూపుతారా అని సుప్రీంకోర్టు  ప్రశ్నించింది. ఉద్యోగం కారణంగా చూపి ఒక మహిళను ఉద్యోగం నుంచి తొలగించే ఏ ఒక్క చట్టాన్ని రాజ్యాంగం అనుమతించబోదని అపెక్స్ కోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి పితృస్వామ్య ఆలోచనలు సమానత్వ హక్కును, మానవ నైతికతను నిర్వీర్యం చేస్తాయని వ్యాఖ్యానించింది. వివాహానంతరం మహిళా ఉద్యోగుల హక్కులను హరించే నియమాలు రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. 
 
సైన్యంలో నర్సుగా సేవలు అందించిన సెలినా జానన్ను వివాహం కారణంగా 1988లో కేంద్రం విధుల నుంచి తొలగించింది. ఈ కేసుపై వాదనలను ఆలకించిన ధర్మాసనం.. 26 ఏళ్ల ఆమె న్యాయ పోరాటానికి తెరదించింది. అన్ని బకాయిలతో కలిపి రూ.60 లక్షలు ఆమెకు చెల్లించాలని కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది. విధుల నుంచి తొలగించినప్పుడు సెలినా జాన్ సైన్యంలో లెఫ్టినెంట్ హోదాలో ఉన్నారు. తనను తొలగించడంపై తొలుత ఆమె అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 
 
ఆ తర్వాత 2012లో సాయుధ దళాల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. వెంటనే ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ట్రైబ్యునల్ తీర్పునిచ్చింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్రం 2019లో అత్యున్నత న్యాయ స్థానాన్ని సంప్రదించింది. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ట్రైబ్యునల్ తీర్పులో ఎలాంటి జోక్యం అవసరం లేదని పేర్కొంది. రెండు నెలల్లోగా సెలినాకు రూ.60 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments