Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితికి దిగజార్చారు: మంత్రి భట్టి

Advertiesment
mallu bhatti vikramarka

ఠాగూర్

, శనివారం, 10 ఫిబ్రవరి 2024 (13:19 IST)
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్ర ఖజానాను దిగజార్చారని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. మరో నాలుగు నెలల కోసం ఆయన శనివారం తెలంగాణ బడ్జెట్‌లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తమ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు కట్టుబడివున్నట్టు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత సీఎం కేసీఆర్ ప్రభుత్వం దుర్భరంగా మార్చివేశారని తెలిపారు. ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు. తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలకు సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసిందని ఆయన గుర్తుచేశారు.
 
అయితే, ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి ఇవేమీ తనకు అడ్డుకాదని, ఎంత కష్టడటానికడైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసి తెలంగాణాలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవదూరంగా ఉందని బీఆర్ఎస్‌పై భట్టి విక్రమార్క మండిపడ్డారు. దళిత బంధు పథకానికి బడ్జెట్‌లో రూ.17000 కోట్లు కేటాయించిన గత ప్రభుత్వం వాస్తవంలో ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. 

తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ : మొత్తం బడ్జెట్ రూ.2.75 కోట్లు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఆ రాష్ట్ర విత్తమంత్రి భట్టి విక్రమార్క శనివారం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది పూర్తిస్థాయి బడ్జెట్ కాకపోవడంతో ఎలాంటి ఆకర్షణీయమైన ప్రకటనలు, పథకాలకు అవకాశం లేకుండానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్‌ రూ.2,75,894 కోట్లుగా మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 
 
గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటూ స్వేచ్ఛను సంపాదించుకున్నారు. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నట్టు తెలిపారు. ఈ బడ్జెట్‌న సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో రూపొందించి, సభలో ప్రవేశపెడుతున్నట్టు పేర్కొన్నారు. 
 
త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలల కాలానికి సంబంధించిన కేటాయింపులే బడ్జెట్‌లో వెల్లడించారు. ఈ యేడాది మొత్తానికి అంచనాలు ప్రకటించారు. అంతకుముందు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.
 
మంత్రి భట్టి బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
మొత్తం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ : రూ.2,75,891 కోట్లు 
రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు
మూల ధన వ్యయం రూ.29,669 కోట్లు
ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు
వ్యవసాయానికి రూ.19.746 కోట్లు
ఐటీ శాఖకు రూ.774 కోట్లు
పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు
విద్యా రంగానికి రూ.21,389 కోట్లు
మూసీ ప్రాజెక్టుకు రూ.1,000 కోట్లు 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గరిట కాల్చి భర్త చెంపపై వాత పెట్టిన భార్య... ఎక్కడ?