నీట్ పరీక్షను రద్దు చేయలేమన్న సుప్రీంకోర్టు

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (19:45 IST)
జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన నీట్ పేపర్ లీకైందని, అందువల్ల పరీక్ష రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. 
 
నీట్-2021 లీకైందని, మాల్ ప్రాక్టీసు కూడా జరిగిందని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. నీట్‌ను రద్దు చేసి మరోసారి పరీక్ష నిర్వహించాలని, కష్టపడి చదివిన విద్యార్థులకు న్యాయం చేయాలని ఆ పిటిషన్లలో కోరారు. 
 
దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఎల్.నాగేశ్వర రావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పేపర్ లీకైందన్న కారణంతో నీట్ రద్దు చేయాలనడం సరైంది కాదని.. నీట్‌కు దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు హాజరైన విషయాన్ని గుర్తించాలని ధర్మాసనం పిటిషనర్లకు హితవు పలికింది. 
 
ఆ విద్యార్థుల భవిష్యత్‌ను కూడా లెక్కలోకి తీసుకోవాలని చెప్పింది. ఈ క్రమంలో ఆయా పిటిషన్లను కొట్టివేసింది. అంతేకాదు మరోసారి ఇలాంటి పిటిషన్లతో వస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం