ఢిల్లీ-ఎన్సీఆర్‌లో వీధి కుక్కల బెడత తీవ్రంగా ఉంది. ఉదయం, రాత్రి పూట వాకింగ్‌కు వెళ్లేవారిపై, పిల్లలపై వీధి కుక్కలు దాడులు చేస్తున్నాయి. దీంతో ప్రజల్లో రేబిస్ వ్యాధి భయం నెలకొంది. పలువురు కుక్కల దాడిలో చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో వీధి కుక్కల సమస్య పెరగడంపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఉన్న వీధి కుక్కలన్నింటినీ గుర్తించి షెల్డర్లకు తరలించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వును 8 వారాల్లోగా అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
అంతేకాదు వీధి కుక్కుల, వాటిని పెంచుకునే ప్రజల హక్కుల మధ్య బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పింది. కానీ మనుషుల ప్రాణాల కంటే జంతువుల క్షేమం ముఖ్యం కాదని తెలిపింది.
రేబిస్ వ్యాధితో మృతి చెందిన వాళ్లను ఎవరు బయటకు తీసుకొస్తారని సుప్రీంకోర్టు ధ్వజమెత్తింది. వీధి కుక్కల బెడద అనేది ఒక ఇబ్బందికరమైన విషయం మాత్రమే కాదని.. ఇది ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని అసహనం వ్యక్తం చేసింది. ఇది తీవ్రమైన ప్రజా భద్రతా సమస్య అని పేర్కొంది.