Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 హైకోర్టులకు 68 మంది పేర్లను సిఫార్సు చేసిన కొలీజియం

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (08:58 IST)
దేశంలోని హైకోర్టుల్లో న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగావున్నాయి. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, దేశంలోని 12 హైకోర్టులకు ఒకేసారి 68 మంది పేర్లను సిఫార్సు చేసి చరిత్ర సృష్టించింది.
 
సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం 12 హైకోర్టులకు 68 మంది పేర్లను జడ్జిలుగా సిఫారసు చేసింది. వీరిలో పది మంది మహిళలు ఉండటం గమనార్హం. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్‌ల నేతృత్వంలోని కొలీజియం మొత్తం 113 మంది పేర్లను పరిశీలించింది. వీరిలో 82 మంది న్యాయవాదులు కాగా 31 మంది జ్యుడీషియల్‌ సర్వీస్‌ అధికారులు ఉన్నారు. 
 
చివరికి 44 మంది న్యాయవాదులు, 24 మంది జ్యుడీషియల్‌ సర్వీసెస్‌ అధికారులను హైకోర్టు న్యాయమూర్తి పదవులకు సిఫార్సు చేయాలని కొలీజియం నిర్ణయించింది. షెడ్యూల్డ్ తెగలకు చెందిన మహిళా జ్యుడీషియల్ అధికారి మరాలి వంకుంగ్ పేరును గౌహతి హైకోర్టుకు సిఫార్సు చేసింది. రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మిజోరం నుంచి వచ్చిన తొలి హైకోర్టు న్యాయమూర్తిగా ఆమె రికార్డులకెక్కుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

తర్వాతి కథనం
Show comments