Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టార్ హోటళ్ళలో కూర్చొని రైతులపై సెటైర్లు వేస్తారా? సుప్రీంకోర్టు ఫైర్

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (16:41 IST)
రైతులను ఉద్దేసించి పలువురు రాజకీయ నేతలు చేస్తున్న కామెంట్స్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టార్ హోటళ్ళలో కూర్చొని రైతులపై సెటైర్లు వేస్తారా అంటూ మండిపడింది. పైగా, ఢిల్లీ కాలుష్యానికి రైతులను బాధ్యులను చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యానికి రైతులు ఎలా కారణమో చెప్పాలంటూ మండిపడింది. 
 
'కొందరు ఢిల్లీలోని ఫైవ్‌స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లలో కూర్చొని కాలుష్యానికి కారణం రైతులేనంటూ అభాండాలు వేస్తున్నారు. అసలు వారికున్న భూమితో రైతులకొచ్చే ఆదాయం ఎంతో ఈ పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తున్న వారికి తెలుసా?' అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మండిపడ్డారు.
 
నిషేధం ఉందని తెలిసినా బాణసంచా కాలుస్తున్నామన్న విషయాన్నే అందరూ మరచిపోయారని అసహనం వ్యక్తం చేశారు. దీపావళి అయిపోయి 10 రోజులవుతున్నా టపాసులను ఇంకా ఎందుకు అనుమతిస్తున్నారని చీఫ్ జస్టిస్ నిలదీశారు. 
 
ప్రజలకూ కొంత బాధ్యత ఉండాలన్నారు. ప్రతిదీ కోర్టు ఆదేశాలతోనే జరగడం సాధ్యం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ దీనిని ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments