Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుడమికి చేరిన సునీతా విలియమ్స్... ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలేంటి?

ఠాగూర్
గురువారం, 20 మార్చి 2025 (13:09 IST)
వారంరోజుల ప్రయోగం కోసం అంతరిక్ష పరిశోధనా కేంద్రా(ఐఎస్ఎస్)నికి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అనివార్య కారణాలతో అక్కడే తొమ్మిది నెలల పాటు ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సునీతా విలియమ్స్‌‍తో సహా ఇతర వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన స్టార్ క్యాప్సూల్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆమె అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఆమె భూమికి చేరుకున్నారు. 
 
అయితే, అంతరిక్షంలో సుధీర్ఘకాలం ఉండి భూమికి చేరుకున్న సునీతా విలియమ్స్ భూవాతావరణానికి అలవాటుపడటానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. కాబట్టి శరీరం తేలికగా మారుతుంది. సునీత అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపడం వల్ల ఆమె ఎముకలు పెళుసుబారి, కండరాలు క్షీణించివుంటాయి. 
 
రేడియేషన్ కారణంగా దృష్టిలోపం వంటి సమస్యలు ఉత్పన్నంకావొచ్చు. రక్తప్రసరణలో తేడా వస్తుంది. రక్తం గడ్డకట్టే ప్రమాదం లేకపోలేదు. ఈ సమయంలో ఆమె వైద్యుల పర్యవేక్షణలో సరైన జాగ్రత్తలు తీసుకుని మళ్లీ భూవాతావరణానికి అలవాటు పడాలంటే కనీసం ఒక నెల రోజులైనా సమయం పడుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments