Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య సునంద మృతి కేసులో శశి థరూర్‌కు క్లీన్ చిట్

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (11:52 IST)
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శ‌శి థ‌రూర్‌కు విముక్తి ల‌భించింది. భార్య సునందా పుష్క‌ర్ అనుమానాస్ప‌ద మృతి కేసులో ఆయనపై ఉన్న అన్ని రకాల ఆరోపణలను కోర్టు కొట్టివేసింది. దీంతో ఈ కేసులో ఆయనకు క్లీన్ చిట్ లభించినట్టయింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు స్పెష‌ల్ జ‌డ్జి గీతాంజ‌లి గోయ‌ల్ తీర్పును వెలువ‌రించారు. 
 
అదేసమయంలో కోర్టుకు బాండ్లు స‌మ‌ర్పించాల‌ని న్యాయ‌మూర్తి త‌న తీర్పులో ఎంపీ శ‌శిని ఆదేశించారు. కోర్టు తీర్పు త‌ర్వాత శ‌శిథ‌రూర్ రియాక్ట్ అయ్యారు. 7.5 ఏళ్ల పాటు త‌న‌ను దారుణంగా వేధించిన‌ట్లు చెప్పారు. 
 
కాగా, సునందా పుష్క‌ర్ 2014, జ‌న‌వ‌రి ఏడో తేదిన అనుమానాస్ప‌ద రీతిలో మ‌ర‌ణించిన విషయం తెల్సిందే. ఢిల్లీ పోలీసులు ఈ కేసులో విచార‌ణ చేప‌ట్టారు. సెక్ష‌న్ 302 మ‌ర్డ‌ర్ కేసు కూడా ఎంపీఐ పెట్టారు. 
 
శ‌శిథ‌రూర్‌పై 306 (ఆత్మ‌హ‌త్యాయ‌త్నం), సెక్ష‌న్ 498ఏ (భ‌ర్త క్రూర‌త్వం) సెక్ష‌న్ల కింద కూడా కేసులు న‌మోదు చేసి విచారించారు. ఈ కేసులో శశిథ‌రూర్ త‌ర‌పున సీనియ‌ర్ అడ్వ‌కేట్ వికాశ్ పాహ్వా వాదించారు.
 
సునంద‌ను మాన‌సికంగా కానీ శారీర‌కంగా కానీ త‌న క్ల‌యింట్ వేధించ‌లేద‌ని న్యాయ‌వాది కోర్టుకు చెప్పారు. ఫోరెన్సిక్‌, మెడిక‌ల్ నివేదిక‌ల ప్ర‌కారం సునంది హ‌త్య లేక సూసైడ్ కూడా కాద‌ని చెబుతున్న‌ట్లు కోర్టులో వాదించారు. 
 
ప్ర‌మాద‌వ‌శాత్తు సునంద మ‌ర‌ణించి ఉంటుంద‌ని కొన్ని నివేదిక‌ల‌ను కోర్టుకు స‌మ‌ర్పించారు. నాలుగేళ్ల విచార‌ణ త‌ర్వాత ఢిల్లీ పోలీసులు ఎటువంటి ఆధారాల‌ను సేక‌రించ‌లేక‌పోయిన‌ట్లు పాహ్వా కోర్టుకు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments