Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుజనా చౌదరి చప్పట్లు కొట్టడం సరికాదు... మతిలేని పనులంటే ఇవే : చంద్రబాబు

రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశంపై ఉపసభాపతి పీజే కురియన్ రూలింగ్‌ ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ సభ్యులతో పాటు.. కేంద్ర మంత్రి, తెదేపా ఎంపీ సుజనా చౌదరి బల్లలు చరిచడంపై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2016 (09:57 IST)
రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశంపై ఉపసభాపతి పీజే కురియన్ రూలింగ్‌ ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ సభ్యులతో పాటు.. కేంద్ర మంత్రి, తెదేపా ఎంపీ సుజనా చౌదరి బల్లలు చరిచడంపై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని చంద్రబాబు దృష్టికి ఓ విలేఖరి తీసుకొచ్చారు. దీనిపై బాబు స్పందిస్తూ.. 'కేంద్ర మంత్రిగా ఉండి ఆయనకు అర్థంకాకుండా చేశారో ఏమో తెలీదు గానీ.. అలా చప్పట్లు కొట్టడం సరికాదు. ఇలాంటివే మతిలేని చర్యలంటే' అని వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే.. కాంగ్రెస్‌ పార్టీ ఇంకా నాటకాలాడుతోంది. ఆ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. వస్తు సేవల బిల్లుకు మద్దతు తెలపాలంటే ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబరు బిల్లును ఆమెదించాల్సిందే అని మెలిక పెట్టి ఉంటే ఖచ్చితంగా ప్రైవేట్ మెంబరు బిల్లు ఆమోదం పొంది ఉండేదని చంద్రబాబు అన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయకుండా మిన్నకుండి పోయిందన్నారు 
 
రాజకీయాల్లో అవకాశమున్నప్పుడే గట్టిగా అడిగి సాధించుకోవాలి. ఆ పార్టీ అలా చేయలేదు. దీన్ని బట్టే వారి ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ ప్రయోజనం పొందాలన్న లక్ష్యమే తప్ప ప్రజలకు మేలు చేయాలన్నది ఆ పార్టీ ఉద్దేశం కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments