ప్రేమించి గర్భవతిని చేశాడు.. పెళ్లికి నిరాకరించడంతో బాయ్‌ఫ్రెండ్‌ను హత్య చేసిన యువతి

బెంగుళూరులో ఓ ప్రేమికురాలు తన బాయ్‌ఫ్రెండ్‌ను హతమార్చింది. ఆర్నెల్లుగా ప్రేమించి.. ఆపై పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి చేసుకోమని కోరడంతో నిరాకరించాడు. దీంతో ఆగ్రహోద్రుక్తుర

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2016 (10:31 IST)
బెంగుళూరులో ఓ ప్రేమికురాలు తన బాయ్‌ఫ్రెండ్‌ను హతమార్చింది. ఆర్నెల్లుగా ప్రేమించి.. ఆపై పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి చేసుకోమని కోరడంతో నిరాకరించాడు. దీంతో ఆగ్రహోద్రుక్తురాలైన ఆ యువతి.. బాయ్‌ఫ్రెండ్‌ను హతమార్చింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కేరళ రాష్ట్రానికి చెందిన మన్సూర్ (27) బెంగళూరుకు వలస వచ్చి సిటీ రైల్వేస్టేషను వద్ద టీ స్టాల్ నడిపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మైసూర్ నగరానికి చెందిన శ్రుతి (21) అనే యువతి జలహళ్లి ప్రాంతంలో పేయింగ్ గెస్టుగా ఉంటూ మెడికల్ కళాశాలలో పారామెడికల్ కోర్సు చేస్తోంది. వారం వారం రైలులో మైసూరుకు వెళ్లి వస్తున్న క్రమంలో శ్రుతికి రైల్వేస్టేషను వద్ద టీస్టాల్ నడుపుతున్న మన్సూర్‌తో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. 
 
ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని మన్సూర్‌పై శృతి ఒత్తిడి చేసింది. దీనికి అతను నిరాకరించగా.. అబార్షన్ చేయించుకోమంటూ ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో ఆగ్రహించిన శృతి... స్థానికంగా ఉండే ఓ లాడ్జీలోకి మన్సూర్‌ను తీసుకెళ్లి... నిద్రమాత్రలు కలిపిన జ్యూస్ తాగించడంతో ఆయన నిద్రలోకి జారుకున్నాడు. అంతే ఆయనపై పెట్రోలు పోసి నిప్పటించింది. మన్సూర్ మంటల్లో కాలి బూడిదయ్యాడు. 
 
లాడ్జీ గదిలో మంటలు వ్యాపించడంతో పారిపోతూ మన్సూర్ ఆత్మహత్య చేసుకున్నాడని కథ అల్లింది. కొన్ని నిద్రమాత్రలు మింగిన శ్రుతిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయం వెలుగుచూసింది. గర్భవతి అయ్యాక తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడనే ఆగ్రహంతోనే మన్సూర్ కు నిప్పంటించి హతమార్చానని నిందితురాలైన శ్రుతి అంగీకరించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం