మా ఇంటికి వస్తే కొడైనాడు నుంచి తెప్పించిన ప్రత్యేక టీ ఇస్తా... జయలలిత గత వాక్యాలు...

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే జయలలిత మృతి పట్ల రాష్ట్ర ప్రజలే కాదు.. ఆమెకు వైద్య సేవలు అందించిన వైద్యులు, సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. అపోలో ఆస్పత్రిలో ఆమె గడిపిన రోజులను అక్కడి సిబ్బంది న

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2016 (10:02 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే జయలలిత మృతి పట్ల రాష్ట్ర ప్రజలే కాదు.. ఆమెకు వైద్య సేవలు అందించిన వైద్యులు, సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. అపోలో ఆస్పత్రిలో ఆమె గడిపిన రోజులను అక్కడి సిబ్బంది నెమరవేసుకున్నారు.

జయలలిత ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులూ తమతో నడుచుకున్న తీరు వారు గుర్తుచేసుకుంటున్నారు. ఓసారి జయలలిత ఆస్పత్రిలో తయారు చేసిన కాఫీ తాగారట. అది ఆమెకు నచ్చలేదట. దీంతో 'మీరంతా నా నివాసం పోయెస్‌ గార్డెన్‌కు రండి కొడైనాడు నుంచి తెప్పించిన ప్రత్యేక టీ'ని ఇస్తా అంటూ చమత్కరించారని ఆమెకు వైద్య సేవలందించిన వైద్య నిపుణుడు డాక్టర్‌ రమేష్‌ వెంకటరామన్‌ తెలిపారు.
 
ఆమె ఆస్పత్రిలో ఉన్నంతకాలం తమతో సన్నిహితంగా ఉండేవారని, సరదాగా సంభాషించే వారని అక్కడ పనిచేసే నర్సులు తెలిపారు. 'మీరు ఏం చెప్పినా చేసేందుకు సిద్ధం' అంటూ ఎప్పుడూ తమతో అనేవారని తెలిపారు. ఆమెకు ఇష్టమైన ఉప్మా, పొంగల్‌, పెరుగు, బంగాళదుంప కూరను వ్యక్తిగత వంట మనిషి ప్రత్యేకంగా సిద్ధం చేసి తీసుకొచ్చేవారని.. వాటిని ఇష్టంగా ఆరగించేవారని గుర్తుచేసుకున్నారు. జయలలిత కోసం షిఫ్ట్‌ పద్ధతుత్లో 16 మంది పనిచేసినట్లు వారు తెలిపారు. 
 
డ్యూటీ డాక్టర్లతో ఆమె ఎంతో సన్నిహితంగా మెలిగేవారని డాక్టర్‌ సెంథిల్‌ కుమార్‌ తెలిపారు. నవంబర్‌ నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో తమ పార్టీ విజయభేరీ మోగించిన దృశ్యాలనూ ఆమె టీవీలో వీక్షించారని తెలిపారు. కానీ మళ్లీ అనారోగ్యానికి గురికావడం, సోమవారం రాత్రి మరణించడం తమను కలచివేసిందంటూ ఆమెతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని వారు బోరున విలపించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments