Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ ఆఫీస్‌లో మహిళపై విద్యార్థి కార్యకర్త అత్యాచారం!

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (17:58 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి అని చెప్పడానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది. తనపై అత్యాచారం చేసాడని పేర్కొంటూ ఓ మహిళ(21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. పాలక్కడ్ జిల్లాలోని చేరుప్లాస్సెరీ ప్రాంతంలో గల అధికార సీపీఐ(ఎం) ఏరియా కమిటీ కార్యాలయంలో తనపై ఈ అఘాయిత్యం చేటుచేసుకుందని పేర్కొంది. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గడిచిన శనివారం నాడు రోడ్డు పక్కన అప్పుడే పుట్టిన ఆడ శిశువును పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు శిశువు తల్లి ఆచూకీ కనుగొన్నారు. ఆమెను విచారించగా ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘానికి చెందిన ఓ కార్యకర్త పార్టీ ఆఫీసులో తనపై 10 నెలల క్రితం అత్యాచారానికి పాల్పడ్డట్టుగా వెల్లడించింది. కాలేజీ మ్యాగజైన్‌ను రూపొందించే నిమిత్తం పార్టీ ఆఫీస్‌కు వెళ్లగా ఈ దారుణం చోటుచేసుకున్నట్లు తెలిపింది. అత్యాచారం కారణంగా మహిళ ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
 
ఈ విషయంపై స్థానిక సీపీఐ(ఎం) నాయకుడు స్పందిస్తూ సదరు మహిళ ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్త అని తెలిపారు. ఆమె కుటుంబం సైతం పార్టీతో చాలా దగ్గరి సంబంధాలను కలిగి ఉందన్నారు. పార్టీ పరంగా విచారణ చేపట్టినట్లు చెప్పారు. కాగా దీనిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రమేష్‌ చెన్నితల స్పందిస్తూ.. సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయాలు అత్యాచార కేంద్రాలుగా తయారయ్యాయని విమర్శించారు. కేరళలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments