Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పోర్ట్స్ టీచర్ లైంగిక వేధింపులు.. జిల్లాస్థాయి క్రీడాకారిణి విషం తాగేసింది..

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (15:20 IST)
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని తీర్చిదిద్దాల్సిన గురువులు లోకం శోఛించే విధంగా తప్పులకు పాల్పడుతున్నారు. విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటన మహారాష్ట్రలో అహ్మదాపుర జిల్లా ధాల్‌గాన్‌లో జరిగింది. 
 
స్థానిక సెకండరీ ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న గణేష్ బోంబే అనే స్టోర్ట్స్ టీచర్ అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిని కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆమెతో అసభ్యంగా మాట్లాడటం, దుర్భాషలాడటం వంటివి చేసాడు.
 
ఈ వేధింపుల వలన తీవ్ర అసహనానికి గురైన బాలిక, 15 రోజుల నుండి పాఠశాలకు వెళ్లడం మానేసింది, జీవితంపై విరక్తి కలిగి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దాంతో ఆమెను చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ టీచర్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. 
 
విద్యార్థిని కబడ్డీలో జిల్లా స్థాయి క్రీడాకారిణి. సహ విద్యార్థులు ఆమె మంచి ప్లేయర్ అని చెబుతున్నారు. ఆ టీచర్‌ని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి వారికి గుణపాఠం చెప్పాలని ఆమె తల్లిదండ్రులు మరియు తోటి విద్యార్థులు కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

ఫ్యాన్స్ షాక్: కుడిచేతికి కట్టు వేసుకుని కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఐశ్వర్యా రాయ్ - video

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం