మరోమారు వందే భారత్ రైలుపై రాళ్లదాడి..

Webdunia
మంగళవారం, 2 మే 2023 (14:17 IST)
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి దేశంలోని వివిధ మార్గాల్లో నడుపుతున్న వందే భారత్ రైళ్లపై కొందరు అకతాయిలు రాళ్లతో దాడులు చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మొదలైన ఈ రాళ్ళ దాడి.. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. ఇటీవల సికింద్రాబాద్ - విశాఖపట్టణం ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలుపై దాడి జరిగింది. తాజాగా కేరళ రాష్ట్రంలో కూడా ఈ దాడి జరిగింది. 
 
కాసర్‌కోడ్ నుంచి తిరువనంతపురం ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలుపై తిరునవాయి - తిరూర్ ప్రాంతాల మధ్య కొందరు అకతాయిలు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ కోచ్‌కు చెందిన అద్దాలు స్వల్పంగా పగిలిపోయాయి. ఈ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ రైలును ప్రధానమంత్రి నరకేంద్ర మోడీ గత నెల 25వ తేదీన ప్రారంభించారు. తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్‌ నుంచి ఈ రైలు బయలుదేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments