విద్యుత్‌ మీటర్లపై సీఎం కేసీఆర్ మాటలు అవాస్తవం : కేంద్రం క్లారిటీ

Webdunia
బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (14:05 IST)
ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ చుట్టూ వివాదాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మద్దతిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతుండగా.. తాజాగా కొన్ని రోజులుగా తెలంగాణలో కరెంటు మీటర్ల రాజకీయం హీటెక్కింది. 
 
ఈ ఇష్యూపై కేసీఆర్‌, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర సర్కార్. విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా కేంద్రం వ్యసాయ బోర్లు, బావుల మోటార్లకు మీటర్లు పెట్టాలని, మెడపై కత్తి పెట్టిందని ఆరోపించారు కేసీఆర్.
 
కానీ కేసీఆర్ ఆరోపణలను కేంద్ర విద్యుత్ శాఖ తీవ్రంగా ఖండించింది. వ్యవసాయ బోర్లు, బావుల వద్ద మోటార్లకు విద్యుత్‌ మీటర్లు పెట్టాలని రాష్ట్రాలను బలవంతం చేయట్లేదని స్పష్టం చేసింది. పునరుత్పాదక ఇంధన వినియోగానికి సంబంధించి ఏ రాష్ట్రంపైనా ఇప్పటి వరకు ఒత్తిడి చేయలేదని తెలిపింది. 
 
సౌర విద్యుత్‌ కొనుగోలుకు రాష్ట్రాలను బలవంతం చేయట్లేదని, విద్యుత్‌ కొనుగోలు వ్యవహారాలన్నీ ఓపెన్‌ బిడ్ల ద్వారానే జరుగుతాయని కేంద్రం స్పష్టం చేసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments