Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించలేదని కత్తితో 40 పోట్లు పొడిచాడు.. ఎక్కడ?

ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణాలు అన్నీఇన్నీ కావు. తనంటే ఇష్టం లేదని చెప్పినా వినకుండా కొందరు యువకులు విచక్షణ కోల్పోయి యువతులను చంపేస్తున్నారు. ప్రేమ అనేది ఇద్దరి మధ్యా చిగురించాల్సిందే. అవతలి వ్యక్తిత

Webdunia
శనివారం, 10 మార్చి 2018 (16:49 IST)
ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణాలు అన్నీఇన్నీ కావు. తనంటే ఇష్టం లేదని చెప్పినా వినకుండా కొందరు యువకులు విచక్షణ కోల్పోయి యువతులను చంపేస్తున్నారు. ప్రేమ అనేది ఇద్దరి మధ్యా చిగురించాల్సిందే. అవతలి వ్యక్తితో సంబంధం లేకుండా ప్రేమిస్తే అది ఒన్ సైడ్ లవ్ అవుతుంది. ఐతే తను ప్రేమిస్తున్నా అవతలి వ్యక్తి ప్రేమించడం లేదని వారిపై దాడికి పాల్పడటం, చంపేయడం లాంటివి చేయడం షరామామూలే అయిపోయింది. తమిళనాడు రాష్ట్రంలో అలాంటి సంఘటనే జరిగింది. తనను ప్రేమించలేదన్న కోపంతో యువతిని 40 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది.
 
చెన్నై శివారులోని మధురవాయిల్‌కు చెందిన అశ్విని.. కే.కే.నగర్ లోని మీనాక్షి కళాశాలలో బీకాం మూడో సంవత్సరం చదువుతోంది. మధురవాయిల్ లోనే ఉంటున్న అళగేశన్ గత కొన్ని నెలలుగా అశ్వినిని ప్రేమ పేరుతో వేధిస్తూ ఉన్నాడు. తనకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా అళగేశన్ వినిపించుకోలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది అశ్విని. పోలీసులు అళగేశన్‌ను అరెస్టు చేశారు. ఆ తరువాతైనా అళగేశన్ సైలెంట్ అయిపోతాడని అనుకుంది అశ్విని. కానీ అతనే తన ప్రాణాన్ని తీస్తాడని ఊహించలేకుండా పోయింది. 
 
తనను ప్రేమించకపోగా.. పోలీసులతో కొట్టిస్తావా అంటూ కళాశాల నుంచి ఇంటికి వెళుతున్న అశ్వినిని నడి రోడ్డుపై 40 సార్లు కత్తితో పొడిచాడు. స్థానికులు చూస్తుండగా అళగేశన్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments