Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విద్యార్థినిపై ఉన్మాది బ్లేడుతో దాడి.. చున్నీ లాగాడు.. ఆపై చేతి, భుజంపై?

భీమవరంలో ఓ కళాశాల విద్యార్థినిపై ఉన్మాది బ్లేడుతో దాడి చేశాడు. పట్టపగలే విద్యార్థినిపై జరిగిన ఈ దాడి స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. భీమవరం పాలకోడేరు మండలం వేండ్ర గ్రామానికి చెందిన

విద్యార్థినిపై ఉన్మాది బ్లేడుతో దాడి.. చున్నీ లాగాడు.. ఆపై చేతి, భుజంపై?
, బుధవారం, 26 జులై 2017 (14:20 IST)
భీమవరంలో ఓ కళాశాల విద్యార్థినిపై ఉన్మాది బ్లేడుతో దాడి చేశాడు. పట్టపగలే విద్యార్థినిపై జరిగిన ఈ దాడి స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. భీమవరం పాలకోడేరు మండలం వేండ్ర గ్రామానికి చెందిన విద్యార్థిని ఇండస్ట్రియల్‌ ఏరియా కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. మంగళవారం ఇంటి నుంచి కళాశాలకు బయల్దేరింది. బ్రౌనింగ్ కళాశాలకు సమీపంలో విద్యార్థిని వెళ్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి మాస్క్ కట్టుకున్నాడు. 
 
నలుపు కలర్ పల్సర్‌పై ఆమెను వెంటాడి... చున్నీ పట్టుకుని లాగాడు. దీంతో విద్యార్థిని కిందపడిపోయింది. ఆ తర్వాత ఆమె చేయి, భుజంపే బ్లేడుతో గాయం చేసి పారిపోయాడు. ఈ విషయాన్ని బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలోవెరా జ్యూస్ తాగి కడుపు ఖాళీ చేస్తున్నారట.. డోపింగ్ టెస్ట్ తప్పదంటున్న సిట్