Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 నుండి చెన్నైలో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య పవిత్రోత్సవాలు

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (18:49 IST)
త‌మిళ‌నాడు రాష్ట్రం, చెన్నై టి.న‌గ‌ర్‌లోని టిటిడి స‌మాచార కేంద్రంలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ఆగ‌స్టు 18 నుండి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్నారు. ఆగ‌స్టు 17న సాయంత్రం పుణ్యాహవచనం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. 
 
ఇందులో బాగంగా ఆగ‌స్టు 18వ తేదీ ఉద‌యం యాగ‌శాలలో వైదిక కార్య‌క్ర‌మాలు, చతుష్టార్చన, స్వామి, అమ్మ‌వార్ల ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం యాగ‌శాల పూజ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.  ఆగ‌స్టు 19న ఉదయం హోమం, పవిత్ర సమర్పణ, సాయంత్రం పవిత్ర హోమం, జ‌రుగ‌నున్న‌ది. 
 
ఆగ‌స్టు 20న  ఉద‌యం హోమాలు, మహాపూర్ణాహుతి, కుంభ‌రాధ‌న‌, స్న‌ప‌న తిరుమంజ‌నం, సాయంత్రం ప‌విత్ర విత‌ర‌ణతో  ప‌విత్రోత్స‌వాలు ముగుస్తాయి. 
 
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments