Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్ అడవుల్లో సైబర్ నేరగాళ్ళు.. రోజుకు 1-2 లక్షలు సంపాదిస్తారట.. నోట్ల రద్దు వరంగా మారింది..

జార్ఖండ్‌లోని జంతారా జిల్లా అడవుల్లో సైబర్ నేరగాళ్లు తిష్ట వేసుకుని కూర్చున్నారట. దాదాపు 8 లక్షల జనాభా ఉన్న ఈ జిల్లాలో చాలామంది సైబర్ క్రిమినల్స్ జార్ఖండ్ అడవుల నుంచి తమ దందా సాగిస్తున్నారని షాకింగ్ న

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (15:31 IST)
జార్ఖండ్‌లోని జంతారా జిల్లా అడవుల్లో సైబర్ నేరగాళ్లు తిష్ట వేసుకుని కూర్చున్నారట. దాదాపు 8 లక్షల జనాభా ఉన్న ఈ జిల్లాలో చాలామంది సైబర్ క్రిమినల్స్ జార్ఖండ్ అడవుల నుంచి తమ దందా సాగిస్తున్నారని షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. దేశంలో సైబర్ నేరాలు ఎక్కువవుతున్న తరుణంలో.. ఈ నేరాలన్నీ జార్ఖండ్‌లోని జంతారా జిల్లా అడవుల నుంచేనని జరుగుతున్నాయని తెలుస్తోంది. దేశంలో జరుగుతున్న సైబర్ నేరాల్లో 80 శాతం జార్ఖండ్ అడవుల నుంచేనని తెలియవచ్చింది. 
 
కాగా, రాంచీకి సుమారు 225 కి.మీ. దూరంలోని ఈ జిల్లాలో గల అడవుల్లో సైబర్ నేరగాళ్ళు తిష్ట వేసుకుని కూచున్నారట. యూజర్ల స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేయడంలో నేర్పరులైన వీళ్ళు క్షణాల్లో వారి బ్యాంక్ ఖాతాలను వివరాలను తీసుకుని తమ అకౌంట్లకు సొమ్మును మళ్లించుకోగలిగే సామర్థ్యం కలవారని తేలింది.

తాజాగా నోట్ల రద్దు ఈ క్రిమినల్ గ్యాంగ్‌కు వరంగా మారింది. డిమానిటైజేషన్ తరువాత ప్రభుత్వ నిబంధనలను పాటించని, ట్యాక్స్ ఎగవేతదారులే వీరి టార్గెట్. తాము ఫలానా బ్యాంకు ప్రతినిధులమని కాల్ చేసి.. మీ డెబిట్ కార్డు బ్లాక్ అయ్యిందని చెప్పి.. వివరాలను సేకరిస్తారు. డెబిట్ కార్డును యాక్టివేట్ చేయిస్తామని చెప్పి వారి డీటైల్స్ తెలుసుకున్న కొద్ది సేపటికే కార్డుల్లోన్ని నగదును దోచేస్తారు. 
 
ఇలా జంతారా అడవుల్లోని ఈ ముఠాలు కేవలం ఓ రెండు మూడు డెబిట్ కార్డుల ద్వారా రోజుకు లక్ష నుంచి రెండు లక్షల వరకు దోచుకుంటున్నారని తెలిసింది. ఈ దోచుకున్న డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని తెలిసింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments