Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదిమందిని పొట్టనబెట్టుకున్న నరరూపరాక్షసుడు.. శబ్ధం లేకుండా ఒక్కొక్కరిగా చంపేశాడు..

అతనికి ఏమైంది. ఎందుకు నరరూప రాక్షసుడిగా ప్రవర్తించాడు. ఇంతకీ కుటుంబం మొత్తాన్ని ఎందుకు మట్టుబెట్టాడు..? కారణం ఏమిటి? అనేదానిపై అమేథీలో జరిగిన ఘటన ద్వారానే సమాధానం లభించాలి. విషయం ఏమిటంటే? కుటుంబం మొత్

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (15:09 IST)
అతనికి ఏమైంది. ఎందుకు నరరూప రాక్షసుడిగా ప్రవర్తించాడు. ఇంతకీ కుటుంబం మొత్తాన్ని ఎందుకు మట్టుబెట్టాడు..? కారణం ఏమిటి? అనేదానిపై అమేథీలో జరిగిన ఘటన ద్వారానే సమాధానం లభించాలి. విషయం ఏమిటంటే? కుటుంబం మొత్తాన్ని హతమార్చి చివరికి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న నరరూప రాక్షసుడి స్టోరీనే ఇది. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు బలికాగా, చావుబతుకుల మధ్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతని భార్య ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడితేనే అసలు విషయం తెలియవస్తుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ పార్లమెంటరీ నియోజకవర్గం అమేథీ పరిధిలోని సుల్తాన్ పూర్ జిల్లా సుకుల్ బజార్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా బ్యాటరీల షాపులో పనిచేసే జమాలుద్దీన్ అనే వ్యక్తి తన కుటుంబానికి చెందిన పది మంది ప్రాణాలను తీసుకున్నాడు. అత్యంత కిరాతకంగా హతమార్చాడు.

మంగళవారం అందరూ నిద్రపోతున్న సమయంలో జమాలుద్ధీన్ వారిపై దాడికి ఒడిగట్టాడు. భార్యా పిల్లలతో పాటు ఇంట్లో ఉన్న బంధువులపై కూడా దాడి చేశాడు. ఎలాంటి అలికిడి లేకుండా.. శబ్ధం లేకుండా ఒకరి తర్వాత ఒకరిని చంపుకుంటూ వచ్చాడు. చివరికి ఇంట్లోనే ఉరేసుకుని జమాలుద్దీన్ ఆత్మహత్య చేసుకున్నాడు.
 
జమాలుద్దీన్ కిరాతక పర్వానికి ఇళ్లంతా శవాలగుట్టలా మారిపోయింది. బుధవారం తెల్లవారుజామున ఈ ఉదంతాన్ని గమనించిన స్థానికులు నిర్ఘాంతపోయారు. చనిపోయిన వారిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారని పోలీసులు చెప్పారు. ఘటనలో నిందితుడు సహా 10మంది ప్రాణాలు కోల్పోగా.. నిందితుడి భార్య మృత్యువుతో పోరాడుతోంది.

సుల్తాన్ పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతన్న ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆమె నోరు విప్పితే కానీ జమాలుద్ధీన్ కుటుంబం మొత్తాన్ని పొట్టనబెట్టుకోవడానికి కారణం ఏమిటనే విషయం వెలుగులోకి రాదని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును కొనసాగిస్తున్నారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments