Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటిని వ్యభిచారకూపంగా మార్చేసిన తండ్రి.. కొడుకు ఏం చేశాడంటే?

ఇంటినే వ్యభిచారకూపంగా మార్చేసిన తండ్రిని కన్నకొడుకు హతమార్చాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల్ని ఇంటి నుంచి తరిమికొట్టి.. ఆ ఇంట్లోనే వ్యభిచారం నడిపాడు ఓ వ్యక్తి. తండ్రి చేస్తున్న పనికి

Webdunia
మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (13:11 IST)
ఇంటినే వ్యభిచారకూపంగా మార్చేసిన తండ్రిని కన్నకొడుకు హతమార్చాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల్ని ఇంటి నుంచి తరిమికొట్టి.. ఆ ఇంట్లోనే వ్యభిచారం నడిపాడు ఓ వ్యక్తి. తండ్రి చేస్తున్న పనికి విసిగిపోయిన కుమారుడు తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడు, మక్కజిల్లా, సేడమంగళంలో జరిగింది.  
 
వివరాల్లోకి వెళితే, సేడ మంగళం సమీపం పోలుకురిచ్చిలో దంపతులు పెరియసామి (45), మణిమేగలై దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె వున్నారు. పెరియసామి ట్రాక్టర్‌ డ్రైవర్‌ పనిచేస్తూ రోజూ పీకల దాకా తాగి ఇంటికొచ్చి భార్యాపిల్లలతో గొడవపడుతుండేవాడు. తాగుడు మానమని చెప్పినా ఒప్పుకునేవాడు కాదు. తాగొచ్చి కొడుకులను చితకబాదేవాడు. అంతేకాదు భార్యాపిల్లలను ఇంటినుంచి గెంటేసిన అతడు.. ఆ ఇంట్లో ఇతర స్త్రీలతో వ్యభిచారం చేయించాడు.
 
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం పెరియసామి ఇంటి తలుపులు తెరచి ఉండటం, లోపల నుంచి ఎలాంటి అలికిడి వినిపించకపోవడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇంటిని పోలీసులు పరిశీలించగా పెరియ సామి హత్యకు గురైనట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆపై పెరియసామి భార్య, కుమారుల వద్ద పోలీసులు విచారణ జరిపారు. ఆ విచారణలో తన తండ్రిని తానే కత్తితో పొడిచి హత్యచేశానని కొడుకు అజిత్ అంగీకరించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

తర్వాతి కథనం
Show comments