Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయా? రాజ్‌నాథ్ సింగ్ మాటలకు అర్థం ఏమిటి?

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌పై మరోసారి సర్జికల్ దాడులు జరిగినట్లు పరోక్షంగా వెల్లడించారు. ఏం జరిగిందో చెప్పలేను కానీ ఏదో ఒకటి మాత్రం జరిగిందని తెలిపారు. రెండు రోజుల క్రితమే ఆ వ్యవహ

Webdunia
శనివారం, 29 సెప్టెంబరు 2018 (10:48 IST)
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌పై మరోసారి సర్జికల్ దాడులు జరిగినట్లు పరోక్షంగా వెల్లడించారు. ఏం జరిగిందో చెప్పలేను కానీ ఏదో ఒకటి మాత్రం జరిగిందని తెలిపారు. రెండు రోజుల క్రితమే ఆ వ్యవహారం కూడా సవ్యంగా జరిగిందని హోం మంత్రి పేర్కొన్నారు. ఈ విషయం ఇప్పటికి కొందరికే తెలుసునని.. అసలు ఏం జరిగిందో మరికొన్ని రోజుల్లో అందరికీ తెలుస్తుందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. 
 
అలాగే పాకిస్థాన్‌పై రాజ్‌నాథ్ సింగ్ నిప్పులు చెరిగారు. తమ దేశం జోలికి రావొద్దని తీవ్రంగా హెచ్చరించారు. పాకిస్థాన్ మన పొరుగు దేశమని, వారిపై కాల్పులు జరపొద్దని సైన్యానికి తాను చెప్పినట్టు మంత్రి తెలిపారు. కానీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే భారత సైన్యం బుల్లెట్ల లెక్కను చూసుకోదని తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. 
 
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ పూర్తిగా అశాంతితో ఉందని, అందుకే భారత్‌ను రెచ్చగొట్టే పనికిమాలిన చర్యలకు దిగుతోందని దుయ్యబట్టారు. కాగా రాజ్‌నాథ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ జరిగినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments