Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ఓవర్.. ఏమిస్తావని.. కౌగిలించుకోమన్నాడు..

ఓ మహిళా జర్నలిస్టుకు చేదు అనుభవం ఎదురైంది. పాస్ పోర్టు వెరిఫికేషన్ కోసం వచ్చిన పోలీసు జర్నలిస్టు పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. పాస్‌పోర్ట్‌ వెరి

Advertiesment
పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ఓవర్.. ఏమిస్తావని.. కౌగిలించుకోమన్నాడు..
, గురువారం, 12 జులై 2018 (18:57 IST)
ఓ మహిళా జర్నలిస్టుకు చేదు అనుభవం ఎదురైంది. పాస్ పోర్టు వెరిఫికేషన్ కోసం వచ్చిన పోలీసు జర్నలిస్టు పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌కు వచ్చిన ఓ పోలీసు అధికారి.. ఒంటరిగా ఉన్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెరిఫికేషన్‌ చేసినందుకు బదులుగా కౌగిలించుకోమన్నాడు. 
 
ఓ ప్రముఖ వార్తా సంస్థలో జర్నలిస్టుగా పనిచేస్తున్న శ్వేతా గోస్వామి అనే మహిళకు ఈ చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఆమె ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, సుష్మాస్వరాజ్‌, ఘజియాబాద్‌ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వరుస ట్వీట్లతో తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ట్వీట్‌లో మహిళలకు భద్రత లేకుండా పోయిందని సదరు మహిళా జర్నలిస్టు మండిపడ్డారు. 
 
వెరిఫికేషన్‌ కోసం ఇంటికొచ్చి.. అవకాశం కోసం ఎదురుచూశాడు. మా ఇంట చాలాసేపు గడిపేందుకు ప్రయత్నించాడు. చివరికి వెరిఫికేషన్ పూర్తి చేశాను. తనకేం ఇస్తావని అడిగాడు. ఇంకా కౌగిలింత కావాలన్నాడు. ఆ పోలీస్ పేరు దేవేరంద్ర సింగ్ అంటూ సదరు మహిళా జర్నలిస్టు ట్వీట్ చేశారు. ఇక వేధింపులకు గురైన మహిళా జర్నలిస్టుకు మద్దతు పెరుగుతోంది. ఆమెను వేధించిన పోలీసుపై చర్యలు తీసుకోవాలని వారు నెట్టింట డిమాండ్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త లేడు.. గ్యాస్ స్టౌవ్ మెకానిక్‌తో ఆ సంబంధం.. తండ్రి అడ్డు తగిలాడని?