Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగపామును చంపితే.. ఆడపాము తరుముకుంది.. కాపలాకు నలుగురు

ఉత్తరప్రదేశ్‌లో 24 ఏళ్ల యువకుడు ఓ పాముకు భయపడి అదీ ఆడ పాముకు భయపడి... నలుగురిని కాపలా పెట్టుకున్నాడు. ఆ ఆడపాము పగబట్టిందని.. దాని కాటుకు భయపడి సెక్యూరిటీని తన వెంటనే పెట్టుకుని తిరుగుతున్నాడు. తాను గ‌

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2017 (16:23 IST)
ఉత్తరప్రదేశ్‌లో 24 ఏళ్ల యువకుడు ఓ పాముకు భయపడి అదీ ఆడ పాముకు భయపడి... నలుగురిని కాపలా పెట్టుకున్నాడు. ఆ ఆడపాము పగబట్టిందని.. దాని కాటుకు భయపడి సెక్యూరిటీని తన వెంటనే పెట్టుకుని తిరుగుతున్నాడు. తాను గ‌త ఏడాది ఓ మగ పామును చంపాన‌ని, అప్పటి నుంచి ఓ ఆడ పాము త‌న‌పై ప‌గ‌బ‌ట్టి చంపాలని చూస్తోంద‌ని చెప్తున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని షాజ‌హాన్‌పూర్ జిల్లాలో ఓ యువ‌కుడు త‌న‌కు ర‌క్ష‌ణ‌గా న‌లుగురు సెక్యూరిటీ గార్డుల‌ను పెట్టుకున్నాడు. ఆ యువకుడు ఎక్కడకెళ్లినా ఆ నలుగురు గార్డులు కాపలా కాస్తుంటారు. మగపామును చంపి వెళ్తున్నప్పుడు ఆడపాము కొన్ని కిలోమీటర్ల మేర తరుముకుందని.. ఆపై ఎన్నోసార్లు తనపై కాటేసేందుకు ప్రయత్నించిందని తెలిపాడు. 
 
ఆ పామంటేనే భ‌య‌ప‌డిపోతున్న ఆ యువ‌కుడు దానిని చంపినవారికి రూ.5000 రివార్డు కూడా ఇస్తాన‌ని ప్రకటించాడు. ఆ యువ‌కుడి తీరుపై ఆ జిల్లా అధికారులు స్పందించారు. వర్షాకాలం కావడంతో పాముల సంచారం సహజమంటున్నారు. ఆ యువ‌కుడిపై పాము దాడి చేయాల‌ని చూస్తోందనే విషయంలో నిజంలేదంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments