Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరు ఎయిర్‌పోర్టులో పేలుడు ... ఆరుగురికి గాయాలు

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (10:12 IST)
సిలికాన్ వ్యాలీ సిటిగా పేరొందిన బెంగుళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో అరుగురికి గాయాలయ్యాయి. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ రోడ్డు మార్కింగ్‌ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. 
 
ఎయిర్‌పోర్టులోని కార్గో కాంప్లెక్స్‌ ముందు భాగంలో రెండవ టెర్మినల్‌ కోసం రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. తెల్లవారుజామున కార్మికులు రోడ్డుకు ఇరువైపులా యంత్రం సహాయంతో తెల్లరంగు మార్కింగ్‌లు, జీబ్రా లైన్లు పూస్తున్నారు. తెల్లరంగు తయారీ కోసం సిలిండర్‌లో రసాయనాలు వేసి వేడి చేస్తుండగా సిలిండర్‌ పేలింది.
 
ఆ మంటలు పక్కనే నిల్వ ఉంచిన రంగుడబ్బాలకు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడే పనిచేస్తున్న కార్మికులకు మంటలంటుకున్నాయి. ఈ ఘటనలో అవినాశ్, సిరాజ్, ప్రశాంత్, గౌతమ్, అజయ్‌కుమార్, నాగేశ్‌రావ్‌ అనే ఆరుగురు కార్మికులు గాయపడ్డారు. 
 
క్షతగాత్రులను బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఫైర్‌ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్టు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీనిపై విమానాశ్రయ వర్గాలు ఎలాంటి ప్రకటన చేయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments