Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధూని విమర్శించేవాళ్లంతా దేశద్రోహులా?

పంజాబ్ మంత్రి మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇటీవల పాక్ ఆర్మీ ఛీప్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాను ఆలింగనం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, పాక్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సిద్ధూకి తన మద్దతుని ట్విట్టర్ ఖాతా ద్వారా మద్దతు తెల

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (20:04 IST)
పంజాబ్ మంత్రి మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇటీవల పాక్ ఆర్మీ ఛీప్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాను ఆలింగనం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, పాక్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సిద్ధూకి తన మద్దతుని ట్విట్టర్ ఖాతా ద్వారా మద్దతు తెలియజేసారు. సిద్దూని విమర్శిస్తున్న వారంతా భారత ఉపఖండంలోని శాంతికి అపకారం చేస్తున్నట్లేనని ట్వీట్ చేసిన ఆయన, ‘నా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు పాకిస్తాన్‌కు వచ్చినందుకు సిద్ధూకు ధన్యవాదాలు. ఆయన శాంతికి రాయబారి. పాకిస్తాన్‌ ప్రజలు సిద్ధూపై ఎనలేని ప్రేమ, ఆప్యాయతలు చూపించారు’ అని ట్వీట్‌ చేశారు.
 
కాగా గురుదాస్‌పూర్‌ జిల్లాలోని డేరాబాబా నానక్‌ నుంచి కర్తార్‌పూర్‌ సాహిబ్‌ వరకు యాత్రికుల కోసం కారిడార్‌‍ని ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు బజ్వా పేర్కొన్న వెంటనే తాను భావోద్వేగానికి లోనై బజ్వాను ఆలింగనం చేసుకున్నానని, దానికి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదనీ సిద్ధూ తన ఆలింగనాన్ని గురించి ఇప్పటికే వివరణ ఇచ్చి ఉన్నారు.
 
భారత ఉపఖండంలోని దేశద్రోహుల గురించి ఇమ్రాన్‌ మాట్లాడటం కాస్త హాస్యాస్పదంగానే అనిపిస్తోన్నప్పటికీ ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సూత్రాన్ని ఇమ్రాన్‌కి, సిద్ధూకి ఎవరు గుర్తు చేస్తారనేదే ఇప్పుడు చర్చనీయాంశం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments