కొడుకు లవర్‌పై తండ్రి లైంగిక దాడి...

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (13:56 IST)
దేశంలో రోజు ఎక్కడోచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. కుమారుడు ప్రేమించిన బాలికపైనే తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన కర్ణాటక రాష్ట్రం చిక్ మంగళూర్ బాళే హెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే..బాళే హెన్నూర్ పరిధిలో ఇద్దరు మైనర్లు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో తన లవర్‌ను కలిసేందుకు బాలిక అతని ఇంటికి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే బాలికపై కన్నేసిన బాలుడి తండ్రి తన కొడుకు బయటకి వెళ్లాడని..రావడానికి సమయం పడుతుందని తెలిపాడు. ఇంట్లోనే ఉండమని కోరాడు. 
 
సాయంత్రం కావడంతో బాలిక కూడా అక్కడే ఉంది. ఇదే అదనుగా భావించిన బాలుడి తండ్రి చంద్రు బాలికపై బలవంతంగా లైంగిక దాడికి తెగబడ్డాడు. అనంతరం ఇంటికి వెళ్లిన బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని తల్లికి చెప్పుకుంది.
 
దీంతో బాలిక తల్లి బాళే హెన్నూర్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలికపై లైంగిక దాడి చేసిన నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం