Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు పోలీసుల ఎదుట హాజరుకానున్న హీరో నాగశౌర్య తండ్రి

Advertiesment
నేడు పోలీసుల ఎదుట హాజరుకానున్న హీరో నాగశౌర్య తండ్రి
, బుధవారం, 3 నవంబరు 2021 (12:14 IST)
హైదరాబాద్‌ శివారులో మూడు ముక్కలాట వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. లక్షలు కుమ్మరించి ఆడుతున్న పేకాటలో బడా నేతలు, సెలబ్రేటీలు ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ కేసులో పోలీసుల విచారణలో హీరో నాగశౌర్య బాబాయ్ పేరు బయటకు వచ్చింది. దీంతో ఈ కేసు విచారణ నిమిత్తం నాగశౌర్య తండ్రి రవి  నార్సింగి పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. 
 
హీరో నాగశౌర్యకు హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ఓ ఫాంహౌస్ ఉంది. ఇందులో పేకాట జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఆ ఫాంహౌస్‌‍పై పోలీసుల దాడి చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అయితే, పోలీసుల విచారణలో పేకా నిర్వాహకుడు గుత్తా సుమన్ చౌదరి పేరుతో పాటు.. హీరో నాగశౌర్య బాబాయ్ పేరు బయటకు వచ్చింది. దీంతో ఈ పేకాట వ్యవహారం కీలకంగా మారింది. ఈ ఇంటిని నివాస ప్రాంతానికి అద్దెకు ఇచ్చారా లేదా పేకాట క్లబ్‌కు అద్దెకు ఇచ్చారా అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్యాన్స్‌కు దీపావళి కానుక ఇచ్చిన 'అఖండ'