Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడి తల తెగనరికి.. సీఎం ఫాంహౌస్‌కు సమీపంలో పూడ్చిపెట్టారు...

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (09:27 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ముగ్గురు వ్యక్తులు కలిసి మరో స్నేహితుడిని అత్యంత దారుణంగా హతమార్చారు. తల నరికి, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫాంహౌస్ సమీపంలోనే శవాన్ని పూడ్చిపెట్టారు. ఈ దారుణం పంజాబ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ రాష్ట్రానికి చెందిన సత్నాం సింగ్, దేశ్ రాజ్, జాగీర్ సింగ్ అనే ముగ్గురు స్నేహితులు ఉన్నారు. వీరంతా కలిసి సుచా సింగ్ అనే మిత్రుడిని మద్యం తాగుదాం అంటూ పిలిచారు. 
 
సీఎం ఫాంహౌస్ సమీపంలోనే వీళ్లంతా మద్యం తాగడం ప్రారంభించారు. వీరిలో ఒకరికి సుచా సింగ్ రూ.60 వేలు బాకీ ఉన్నాడు. అవి ఎప్పుడిస్తావు? అంటూ ముగ్గురూ కలిసి సుచాను నిలదీశారు. ప్రస్తుతం కరోనా కష్టాల్లో ఉన్న సుచా.. ఇంకా సమయం కావాలని అడిగాడు. ఈ క్రమంలో వీరి మధ్య వివాదం చెలరేగింది.
 
వివాదం పెరగడంతో ముగ్గురు మిత్రులూ కలిసి సుచాపై దాడి చేశారు. కత్తితో అతని తల నరికి, దగ్గరలోనే ఆ శవాన్ని పూడ్చిపెట్టి వెళ్లిపోయారు. ఈ ఘటన ఈ నెల 12న జరిగింది. సుచా ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
అదేసమయంలో సుచా మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రదేశంలో అతని కాళ్లు కనిపించడంతో భయపడిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు వెళ్లిన పోలీసులకు తల లేని మృతదేహం కనిపించింది. దుస్తులను చూసి అది సుచా మృతదేహమని గుర్తించారు. దర్యాప్తులో ఆ రోజు సుచాను కలిసిన ముగ్గురిని పట్టుకునే ప్రయత్నం చేశారు. సత్నాం సింగ్, దేశ్ రాజ్‌‌ను పోలీసులు అరెస్టు చేశారు. జాగీర్ సింగ్ పరారీలో ఉన్నాడు.  కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments