Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికుడు హెచ్ఐ‌వీ బాధితుడని తెలిసి అతడి రక్తాన్ని ఎక్కించుకున్న ప్రేయసి

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2022 (12:35 IST)
ప్రేమికుడు హెచ్ఐ‌వీ బాధితుడని తెలిసినా.. ఆమె వెనక్కి తగ్గలేదు. ఆయనకు దూరం కాలేదు. అతడితోనే కలిసి నడవాలనుకుంది. అంతే దీనికోసం ఆమె కూడా హెచ్ఐవీ పేషెంట్‌గా మారింది. అతడి రక్తాన్ని ఎక్కించుకుని తాను కూడా హెచ్ఐవీ బాధితురాలిగా మారింది. అసోంలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశమైంది. 
 
వివరాల్లోకి వెళితే.. కామరూప్ జిల్లాలోని సువల్‌కచికి చెందిన 19 ఏళ్ల యువతికి మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో పొరుగూరికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆపై ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. 
 
ఈ క్రమంలో ఒక రోజు తాను ప్రేమిస్తున్న యువకుడు హెచ్ఐవీ బాధితుడని యువతికి తెలిసింది. అయినా... అతడితోనే జీవితం పంచుకోవాలనుంది. ఆయనతో 3సార్లు పారిపోయింది. అయితే కుటుంబసభ్యులు ఆమెను అతడి నుంచి వేరు చేశారు. దీంతో తాము పెళ్లి చేసుకున్నా తమను విడదీస్తారని భయపడింది. 
 
ఇకపై అలా కాకూడదంటే తాను కూడా హెచ్ఐవీ బాధితురాలిగా మారిపోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా అతడి రక్తాన్ని ఆమె తన శరీరంలోకి ఎక్కించుకుంది. విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడిని అరెస్ట్ చేశారు. 
 
యువతికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో యువతి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించుకున్నట్టు తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments