Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ మాఫియా నన్ను చంపేస్తుందేమో? కోర్టుకు 'డేరా' హనీ

ఒకవైపు డేరా అధినేత గుర్మీత్ రామ్ రహీం సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ పోలీసులకు టోకరా వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందనే వార్తలు తిరుగుతుంటే హనీ మాత్రం ఢిల్లీ హైకోర్టులో ఓ పిటీషన్ వేసి పోలీసులకు షాకిచ్చింది. తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ ఆ పిటీషన్ల

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (14:11 IST)
ఒకవైపు డేరా అధినేత గుర్మీత్ రామ్ రహీం సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ పోలీసులకు టోకరా వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందనే వార్తలు తిరుగుతుంటే హనీ మాత్రం ఢిల్లీ హైకోర్టులో ఓ పిటీషన్ వేసి పోలీసులకు షాకిచ్చింది. తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ ఆ పిటీషన్లో పేర్కొంది. అంతేకాదు... తనను డ్రగ్స్ మాఫియా హతమార్చే అవకాశం వుందనీ, తన ప్రాణాలకు ముప్పు వున్నదంటూ ఆమె తన పిటీషన్లో పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో హనీ పిటీషన్ మంగళవారం మధ్యాహ్నం కోర్టు విచారణకు రానుంది. 
 
మరోవైపు హనీప్రీత్ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఒక దశలో ఆమె నేపాల్ పారిపోయిందంటూ వచ్చిన వార్తలకు అంతా అటువైపు వెళ్లారు. కానీ హనీ మాత్రం ఢిల్లీలోనే వున్నట్లు ఆమె బెయిల్ పిటీషన్ వేయడం బట్టి అర్థమవుతుంది. దీనితో ఒక్కసారిగా పోలీసులు అలెర్ట్ అయ్యారు.

ఢిల్లీ గ్రేటర్ కైలాష్ లోని ఓ ఇంట్లో హనీప్రీత్ ఉన్నారనే సమాచారం అందటంతో హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. పోలీసుల తనిఖీలతో గ్రేటర్ కైలాష్ జనం బిత్తరపోయారు. కానీ పోలీసుల తనిఖీల్లో హనీ జాడ మాత్రం తెలియరాలేదు. మొత్తమ్మీద హనీ దేశంలోనే వుండి పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments