Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్ 27 కలిసిరాదు.. అందుకే జగన్ పాదయాత్ర వాయిదా.. నవంబర్ 2న ప్రారంభం?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లాలనుకున్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే న

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (13:25 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లాలనుకున్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే నంద్యాల, కాకినాడ ఎన్నికలు ఆశించిన స్థాయిలో ఆయనకు మంచి ఫలితాలను ఇవ్వకపోవడంతో జగన్ రెడ్డి.. ప్రజల దగ్గరకు వెళ్లాలనుకున్నారు. 
 
అక్టోబర్ 27 మంచి రోజు కాదని.. ఆనాడు పాదయాత్ర మొదలెడితే ప్రతికూల ఫలితాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు హెచ్చరించడంతో జగన్ పాదయాత్ర తేదీపై నిర్ణయం మార్చుకున్నారు. ఈ మేరకు నవంబర్ ఒకటో తేదీ లేదా నవంబర్ రెండో తేదీన ఆరంభించాలని డిసైడ్ అయ్యారు. 180 రోజుల పాటు జగన్ చేపట్టదలచిన పాదయాత్రను అక్టోబర్ 27న చేపడితే కాలి నొప్పులే మినహా.. సీఎం పోస్టు అందని ద్రాక్షలా మిగిలిపోతుందని జ్యోతిష్కులు హెచ్చరించడంతో జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు పాదయాత్ర చేపట్టాల్సి ఉన్నందున ప్రతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కాకుండా తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ పెట్టుకున్న అభ్యర్థనను హైకోర్టు ఇప్పటికే తోసిపుచ్చింది. పాదయాత్ర పేరిట కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకునేందుకు జగన్ ఎత్తు వేశారని కోర్టు తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో యాత్రకు ప్రతి శుక్రవారం విరామం ఇచ్చి కోర్టుకు పరుగులు తీయాల్సిన పరిస్థితి తలెత్తింది. అలాగే సీబీఐ కేసు నుంచి తన పేరు తొలగించాలన్న అభ్యర్థనపై కోర్టులో విచారణ కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments