Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరద్ పవార్ వెన్ను పోటు: శివసేన సంచలన వ్యాఖ్యలు

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (08:02 IST)
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ పై శివసేన సంచలన వ్యాఖ్యలు చేసింది. పవార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి  శరద్ పవార్ వెన్ను పోటు పొడిచారని పార్టీ సీనియర్ నేత అనంత్ గీతె అన్నారు.

మహారాష్ట్రలో నిర్వహించిన ఓ ర్యాలీలో అనంత్ గీతె మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ పార్టీకి వెన్ను పోటు పొడిచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని శరద్ పవార్ ఏర్పాటు చేశారు. 1999లో ఆయనతో సహా మరో ఇద్దరిని పార్టీ నుంచి తొలగిస్తే ఆ పార్టీ ఏర్పడింది.

అనంతరం మహారాష్ట్రలో అదే కాంగ్రెస్ పార్టీతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలాంటి వ్యక్తి మాకెప్పటికీ నాయకుడు కాదు. మహావికాస్ అగాడీ (శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రభుత్వం) ప్రభుత్వం కేవలం కొన్ని సర్దుబాట్లతో ఏర్పడ్డది’’ అని అన్నారు.
 
భారతీయ జనతా పార్టీతో కొనసాగిన రెండు దశాబ్దాల పొత్తును తెంచుకుని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేన మళ్లీ బీజేపీ వైపుకు వెళ్తోందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా పార్టీ సీనియర్ నేత అనంత్ గీతే చేసిన వ్యాఖ్యలు అందుకు మరింత ఊతమిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కొద్ది రోజుల క్రితం శివసేన అధికారిక పత్రిక సామ్నాలో మోదీని పొగుడుతూ ఆర్టికల్ రావడం, అనంతరం బీజేపీ నేత, కేంద్ర మంత్రిని ‘‘సహజ మిత్రుడు, భవిష్యత్‌లో కలిసి పనిచేయొచ్చు’’ అంటూ శివసేన అధినేత, సీఎం ఉద్దవ్ థాకరే అంటూ వ్యాఖ్యానించడం ఇందుకు ప్రధాన కారణాలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments