Webdunia - Bharat's app for daily news and videos

Install App

షవర్మాతో మృతి.. వెలుగులోకి షిగెల్లా ఇన్ఫెక్షన్.. జాగ్రత్తగా లేకపోతే..?

Webdunia
గురువారం, 5 మే 2022 (09:53 IST)
కేరళలో పదహారేళ్ల అమ్మాయి దేవానంద షవర్మా తినడంతో ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు కారణం కొత్త అంటువ్యాధి అంటూ తేలింది. ఆమె మరణానికి కారణం తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ అని తెలిసింది. అందులోనూ షిగెల్లా బ్యాక్టిరియా సోకిన ఆహారం తినడం వల్లే ఇలా జరిగిందని చెప్పారు ఇప్పుడు కేరళలో షిగెల్లా బ్యాక్టిరియాలో ఒకరి నుంచి ఒకరికి సోకుతుందేమోనన్న భయం అలుముకుంది.
 
షిగెల్లా ఇన్ఫెక్షన్ అనేది షిగెల్లా అని పిలిచే బ్యాక్టిరియా వల్ల కలుగుతుంది. దీన్ని షిగెల్లోసిస్ అని కూడా అంటారు. నోటి ద్వారా ప్రవేశించి పేగులపై అధిక ప్రభావం చూపిస్తుంది. ఇది సోకిన వెంటనే విరేచనాలు మొదలవుతాయి. ఒక్కోసారి రక్త విరేచనాలు కూడా కావచ్చు.
 
వాంతులు అవుతాయి. ఇది అంటు వ్యాధి. షిగెల్లా బ్యాక్టిరియా సోకిన ఆహారాన్ని తినడం వల్ల, ఆ బ్యాక్టిరియా సోకిన వ్యక్తి నుంచి కూడా పక్క వారికి ఇది సోకుతుంది. అందుకే చేతులు బాగా కడుక్కునే ఆహారాన్ని తినమని సూచిస్తున్నారు వైద్యులు. షిగెల్లా బ్యాక్టిరియా ఉన్న నీటిలో ఈత కొట్టినా కూడా ఇది వ్యాపిస్తుంది.
 
చికిత్స ఎలా?
తీవ్రమైన కేసుల్లో ఆసుపత్రిలో చేర్చి అత్యవసర చికిత్స అందించాల్సి రావచ్చు. చేయి దాటి పోతే మరణం కూడా సంభవించవచ్చు. ముఖ్యంగా వైద్యులు షిగెల్లా బ్యాక్టిరియాను చంపడానికి యాంటీ బయోటిక్స్‌ను సూచిస్తారు. ఒక వారంలో బ్యాక్టిరియా బయటికి పోతుంది లేదా నాశనం అవుతుంది. షిగెల్లా వైరస్ శరీరంలోకి చేరాక రెండు రోజుల తరువాత లక్షణాలు కనిపిస్తాయి. వారం రోజుల పాటూ గుర్తించకపోతే సమస్య తీవ్రంగా పెరుగుతుంది.
 
షిగెల్లా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. జ్వరం, విరేచనాలు, వాంతులు, బరువు తగ్గడం, డీహైడ్రేషన్ కు గురవ్వడం, రక్త విరేచనాలు కావడం కనిపిస్తే వెంటనే వైద్యుడిని కలవాలి. జ్వరం 101 డిగ్రీల ఫారెన్ హీట్ కన్నా ఎక్కువ ఉంటే వెంటనే ఆస్పత్రిలో చేరాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఆర్ఆర్' తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీకి అరుదైన రికార్డు

తెలంగాణాలో గద్దర్ అవార్డులు సరే.. మరి ఏపీలో నంది అవార్డులు ఇస్తారా?

PRABHAS :భీమవరంకు రెబల్ స్టార్ ప్రభాస్ రానున్నారా?

కళాకారులకు సేవ - జంథ్యాలపై బుక్ - విజయ నిర్మల బయోపిక్ చేయబోతున్నా: డా. నరేష్ వికె

రానా దగ్గుబాటి సమర్పణలో ప్రేమంటే ఏమిటో చెప్పదలిచిన సుమ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం