ఆమెకి భర్త లేడు, కానీ ఇద్దరు ప్రియులు: మొదటి ప్రియుడ్ని చంపిన రెండో ప్రియుడు

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (16:32 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ హత్య జరిగింది. తన ప్రియురాలి రెండవ ప్రియుడిని గొంతు కోసి చంపిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో దారుణమైన కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసులు హత్య కేసు నమోదు చేసి, అతని ప్రియురాలితో పాటు యువకుడిని అరెస్టు చేశారు.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండేళ్ల క్రితం భర్త చనిపోయిన ఓ వితంతువుతో మృతుడు సర్జీత్ గత కొన్నాళ్లుగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఐతే అంతకంటే ముందే ఈమెకి హర్పాల్ అనే మరో యువకుడితో సంబంధం వుంది. ఈ విషయం సర్జీత్‌కి తెలియకుండా జాగ్రత్తపడింది. ఇద్దరికీ తెలియకుండా మేనేజ్ చేస్తూ సంబంధాలు సాగించింది. ఓ రోజు సర్జీత్ ఆమెతో శృంగారం చేస్తున్నాడు. ఆ సమయంలో హఠాత్తుగా హర్పాల్ ఇంటికి వచ్చాడు.
 
ఇంట్లో సర్జిత్‌ను అభ్యంతరకరమైన స్థితిలో చూశాడు. అంతే... పట్టలేని కోపంతో కత్తి తీసుకుని సర్జీత్ గొంతు కోసేశాడు హర్పాల్. దాంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. శవాన్ని ఎవరికీ అనుమానం రాకుండా ఇద్దరూ కలసి గ్రామానికి దూరంగా అడవిలో పడేశారు. ఐతే అటుగా వెళ్లిన కొందరు దుర్వాసన వస్తుండటంతో పోలీసులకి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సర్జీత్ సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం